English | Telugu

విరూపాక్ష మూవీ అసలు పేరు శాసనం...ప్రొడ్యూసర్ దొరక్క నేను చేయలేదు!

బుల్లి తెర నటుడు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ‘తెప్ప సముద్రం’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటి అర్జున్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విరూపాక్ష మూవీ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. "నా అర్ధనారీ మూవీకి నంది అవార్డు అనౌన్స్ చేసినప్పుడు కొంచెం హల్చల్ చేసాను. తర్వాత అంతే మంచి ప్రాజెక్ట్ పట్టుకోవాలని ఎంతో ట్రై చేసాను. అప్పట్లో ఓటిటి అవన్నీ లేవు అలాగే ఇప్పుడు ఉన్న ఇన్ని అవకాశాలు అప్పుడు లేవు. విరూపాక్ష మూవీ ఉంది కదా ఆ మూవీ అసలు పేరు శాసనం అని పెట్టాము నేను డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీకి ప్రొడ్యూసర్ దొరక్క నేను కార్తీక్ రెండేళ్లు తిరిగాం.

ఐతే అప్పటికి ఎవరూ దొరకలేదు. నేను లీడ్ రోల్ చేయాల్సింది. కానీ ప్రొడ్యూసర్ దొరక్క డిలే ఐపోయింది. నేను కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత సీరియల్స్ లోకి వచ్చేసాను. ఫైనల్ గా కార్తీక్ అందరికీ స్టోరీ చెప్తూ వచ్చాడు చివరికి సుకుమార్ గారి దగ్గరకు ఆ స్టోరీ వెళ్ళింది. ఆయనకు చాలా నచ్చింది. ఆయన కార్తీక్ కలిసి చేంజెస్ చేసి ఆ సినిమా తీశారు. ఐతే ఆ సినిమా నాకు మిస్ అయ్యింది అని ఏమాత్రం బాధ లేదు. కార్తీక్ కి మంచి అవకాశం వచ్చింది అని చాలా హ్యాపీగా ఉంది. నేను, కార్తీక్ చేసి ఉంటే ఇంతలా సక్సెస్ అయ్యుండేది కాదేమో. టీవీ షూట్స్ అవీ ఉండడం వలన అప్పుడు నాకు కుదర్లేదు. అలా ఈ మూవీలో చేయలేకపోయాను. " అని చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.