English | Telugu

Brahmamudi : కావ్య మాటతో ఇంట్లో ఒక్కటే టిఫిన్.. రుద్రాణికి చెక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -600 లో..... కావ్య బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తుంది. వందకోట్ల డబ్బులు ఇన్స్టాల్మెంట్ లో పే చెయ్యడానికి వాళ్లని ఒప్పిస్తుంది. దానికి రాజ్ ఇంప్రెస్ అవుతాడు. చాలా థాంక్స్ ఈ ప్రాబ్లెమ్ నుండి ఎలా బయటపడాలనుకున్నా కానీ నువ్వు చాలా ఈజీగా సాల్వ్ చేసావ్.. కీప్ ఇట్ అప్ అని తన భుజాన్ని తట్టి వెళ్ళిపోతాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

అపుడే శృతి వచ్చి.. ఏంటి మేడమ్ సర్ ని అంతలా మార్చేశారని అంటాడు. నిజంగానే తనలో మార్పు వచ్చిందా అని కావ్య అంటుంది. ఆ తర్వాత టీ పెట్టుకుంటున్న ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. రాబోయే రోజుల్లో టీ స్టాల్ పెట్టుకోవాలని తనని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తాడు. నన్ను భార్యగా ఒప్పుకుంటే చాలు నాకూ.. ఈ థాంక్స్ ఏం వద్దని రాజ్ ని కన్ఫ్యూషన్ చేసినట్లు కావ్య మాట్లాడుతుంటుంది. మీ భార్యలతో ఇదే బాధ కన్ఫ్యూజ్ చేస్తారని రాజ్ అంటాడు. ఇద్దరు ఎన్నడూ లేని విధంగా సరదాగా మాట్లాడుకుంటారు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కానీ ఈ నెలలో ఇరవై కోట్లు కట్టాలని రాజ్ అంటాడు. మీరు నెమ్మదిగా ఆలోచించండి అని కావ్య అనగానే.. రాజ్ మేనేజర్ కి ఫోన్ చేసి వర్క్ త్వరగా కంప్లీట్ కావాలని ఆర్డర్ వేస్తాడు. కానీ ఇప్పుడు ఇంట్లోకి డబ్బులు కావాలి.. వాళ్ళను ఎలా మేనేజ్ చెయ్యాలని రాజ్ అనగానే.. అది నేను చూసుకుంటానని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు స్వప్న దగ్గరికి వచ్చి డబ్బు కావాలని అడుగుతారు. ఇవ్వనని స్వప్న అనగానే.. లేదంటే ధాన్యలక్ష్మికి చెప్తానని బ్లాక్ మెయిల్ చెయ్యగానే.. డబ్బు తీసుకొని వస్తుంది స్వప్న. అప్పుడే కావ్య రాజ్ వస్తారు. ఆగు అక్క అని స్వప్నని కావ్య ఆపుతుంది. ఇంట్లో అందరిని పిలిచి ఇంట్లో ఏ ఖర్చు పెట్టినా నాకు చెప్పాలి. రిసీట్స్ తో సహా అంటూ అని కావ్య అనగానే రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కోప్పడతారు. ఇది ఇంట్లో అందరికి ఇది నా ఆర్డర్ అని కావ్య చెప్తుంది. దానికి ఇందిరాదేవి వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో ఇంట్లో టిఫిన్ ఒక ఇడ్లీనీ చేస్తారు. ఇదేంటని రుద్రాణి అడుగగా.. ఇక నుండి ఇంట్లో ఒక టిఫిన్ మాత్రమే ఉంటుందని కావ్య అంటుంది. ఆ తర్వాత తిండి గురించి ఇలా ఆలోచిస్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుందని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.