English | Telugu

llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో... ధీరజ్ మళ్ళీ ఎందుకు వచ్చాడంటూ రామరాజు గొడవ పెడుతుంటే.. వద్దని వేదవతి ఆపుతుంది. వాడు తప్పు చేసాడని వద్దని అంటున్నారు. మరి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు రానిచ్చారని వేదవతి అడుగుతుంది. రామరాజు ఆలోచలలో పడి.. సరే ఇక ముందు వాడు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి చెప్తానని రామరాజు అంటాడు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య నేనే హెల్ప్ చేస్తే చివరికి నన్నే వెళ్ళమంటారా అని నర్మద అంటుంది. దాంతో నీకు నాకు మాటలు లేవు అంటూ వెళ్ళిపోతుంది వేదవతి.

మరుసటి రోజు ఉదయం నర్మద ఇంటి ముందు ముగ్గువేస్తుంది. అవతల వైపు సేనాపతి భార్య ముగ్గు వేస్తుంది. అప్పుడే తన దగ్గరికి ప్రేమ వచ్చి.. అమ్మ నేను ముగ్గు వేస్తానంటుంది. ప్రేమ ముగ్గు వేస్తు నర్మదతో మాట్లాడుతుంది. ఆ ధీరజ్ గాడిని ఇంట్లోకి రప్పించే ప్రయత్నం చేయకు నర్మద అని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. వాడెలా వచ్చాడని ప్రేమ అనగానే.. నేనే తీసుకొని వచ్చానంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ లు గొడవపడుతు.. ప్రేమ ముగ్గు తప్పు వేస్తుంటే అయ్యో ముగ్గు తప్పు వేస్తున్నావంటూ నర్మద గీత ధాటి వస్తుంది. దంతో సేనాపతి కొడుకు చూసి.. గొడవకి దిగుతాడు. దాంతో ఆ ఇంట్లో వాళ్ళు‌.. ఈ ఇంట్లో వాళ్లందరు వస్తారు.

భద్రవతి టైమ్ దొరికింది కదా అని రామరాజుని తిడుతుంది. దాంతో తనకి ఇదంతా తెలియదని సారీ చెప్తున్నానని సాగర్ అనగానే.. మీ నాన్న చెప్పాలని భద్రవతి అంటుంది. రామరాజు క్షమాపణ అడుగుతాడు. దాంతో భద్రవతి కుటుంబం సంతోషపడుతుంది. మరొకవైపు నర్మద బాధపడుతుంటే.. ధీరజ్ వచ్చి అసలు గొడవేంటో చెప్తాడు. అత్తయ్య ఎక్కడ అంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది నర్మద. తరువాయి భాగంలో రామరాజు ఇంట్లో పూజ జరుగుతుంటే.. ప్రసాదరావు పోలీసులని తీసుకొని వస్తాడు. నర్మదని ట్రాప్ చేసి బలవంతంగా నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడంట.. అంతా నీ వల్లే అంట అని రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.