English | Telugu

పేద కుటుంబానికి అండగా నిలిచిన బ్రహ్మముడి కావ్య, రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. కావ్యగా దీపిక రంగరాజు, రాజ్ పాత్రలో మానస్ నాగులపల్లి బ్రహ్మముడి సీరియల్ లో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే వీరితో పాటు అపర్ణగా శ్రీప్రియ, కనకం పాత్రలో నీపా, స్వప్న గా హమీద చేస్తున్నారు. లేడి విలన్ గా రుద్రాణి పాత్రలో షర్మిత చేస్తుంది. ఈ సీరియల్ కథ ఆసక్తికరంగా సాగుతూ టీఆర్పీలో నెంబర్ వన్ ర్యాంకింగ్ లో కొనసాగుతోంది.

రోజుకో ట్విస్ట్ తో ఆద్యంతం అలరిస్తోన్న ఈ సీరియల్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ లో నటిస్తున్న కావ్య, రాజ్ లు పేద కుటుంబానికి సాయం అందించి, ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకి ముగ్గురు ఆడపిల్లలు.. తన కూలీ డబ్బులతో ఆ ముగ్గురు అమ్మాయిలని చూసుకుంటున్న ఆ అమ్మకి తమ చేతనైన సహాయం చేయడానికి బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న దీపిక, మానస్ లు ముందుకొచ్చారు.

ముగ్గురు ఆడపిల్లలు.. ఎలా వీళ్ళని పెంచాలో తెలియదు.. టెన్షన్ అవుతుంటుందని ఆ అమ్మ ఏడుస్తుండగా.. అందరికి కష్టాలు ఉంటాయమ్మా.. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకం.. మీరు తక్కువ కాకండి.. రేపు ఎలా బతకాలో ఆలోచించుకోండి. మీకు మేమున్నామంటూ కావ్య(దీపిక రంగరాజు) చెప్పింది. మీతో ఉన్న ఈ కష్టాలు కొంతకాలం మాత్రమే రేపు పిల్లలు చదువుకున్నాక మీరు పడ్డ శ్రమ, కష్టం అంతా దూరమవుతుందని రాజ్(మానస్ నాగులపల్లి) చెప్పాడు. ఆ తర్వాత ఆర్థిక సాయం చేసారు.

సమాజసేవ చేయడంలో ముందుండి నడిపేందుకు 'హెచ్ఆర్ ఫర్ యూ' అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఏమీలేని వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఫేమస్ అయిన సెలబ్రిటీలతో ఆ సాయాన్ని అందిస్తున్నారు. కాగా రోజు రోజుకి ఈ యూట్యూబ్ ఛానల్ కి వీక్షకాధరణ పెరుగుతుంది. కొంతకాలం క్రితం ఇదే తరహాలో 'గుప్పెడంత మనసు' లో నటిస్తున్న వసుధార(రక్ష గౌడ), రిషి(ముఖేష్ గౌడ) లతో సాయం అందించగా ఆ వీడియోకి విశేష స్పందన లభించింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి కూడా అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.