English | Telugu

Brahmamudi : కళ్యాణ్ కి సినిమాల్లో అవకాశం రానుందా.. ఆమెకు సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -550 లో.....కావ్య ఇంటికి వస్తుంది. ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందని కనకం అడుగుతుంది. చంపలేదు కానీ అంత పని చేసాడని రాజ్ గురించి కావ్య చెప్తుంది. ఇప్పుడు తాతయ్య గారి దగ్గరికి గొడవకి వెళ్ళాడని కనకంతో కావ్య చెప్పేసి లోపలికి వెళ్తుంది. మరొకవైపు అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు రాజ్ లో ఎలా మార్పు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. అందరు కలిసి రాజ్ ని తిరిగి ఆఫీస్ కి పంపించడం గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా పంపించాలని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత రుద్రాణి దూరంగా ఉండి చూసి.. వీళ్ళేదో చేస్తున్నారని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇందిరాదేవి ఇ‌ంకా వాళ్ళంతా కలిసి రుద్రాణికి చివాట్లు పెట్టి వెళ్ళిపోతారు. అసలు వీళ్ళేం చేయబోతున్నారో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా నిన్ను ఇంట్లో నుండి గెంటేయ్యాలని చూస్తున్నారని స్వప్న అంటుంది. నిన్నే కాదు మీ అబ్బాయిని కూడా పంపాలని చూస్తున్నారని అనగానే.. అలా అయితే నిన్ను కూడా పంపిస్తారని రుద్రాణి అంటుంది. నాకేం..తాతయ్య గారు ఇచ్చిన ఆస్తితో బతికేస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు వస్తుంది. రైటర్ ఇలా అన్నాడని చెప్తాడు. దాంతో అవేం పట్టించుకోకని అప్పు ఎంకరేజ్ చేస్తుంది. మరొకవైపు అసలు ఆఫీస్ లో ఏం జరుగుతుందో కనుక్కోవాలని రాజ్ ల్యాప్ టాప్ ఆన్ చేసి చూస్తాడు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడుగుతుంది. రాక్షసి పాస్వర్డ్ చేంజ్ చేసిందని అనుకుని కావ్యకి మెసెజ్ చేయగా..చెప్పనని కావ్య అనేస్తుంది. నేనే కనుక్కుంటానని రాజ్ అనుకొని ట్రై చేస్తుంటాడు.

అప్పుడే కళ్యాణ్ ని అవమానించిన రైటర్ ఫోన్ చేసి.. నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. నువ్వు ఒక పాట రాస్తే.. అది నాకు నచ్చితే నీకు ఆఫర్ ఇస్తానని అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఇక అప్పు, కళ్యాణ్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు తనని ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడతారని రాజ్ అనుకుంటాడు కానీ ఎవరు పట్టించుకోరు. తరువాయి భాగంలో కావ్యకి అనామిక ఫోన్ చేసి.. అక్కడికి వచ్చే క్లయింట్స్ ని రాకుండా చేశాను. ఒక్కొక్కరిని నీ కంపెనీకి దూరం చేస్తానని సవాలు విసురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.