English | Telugu

Brahmamudi : రుద్రాణి చేతుల్లోకి  ఇంటి తాళాలు.. విడాకులు ఇస్తానని చెప్పడంతో తను షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో.. ఇంట్లో అందరు తమకి కావలసిన వస్తువులు ఒక లిస్ట్ రాసి అపర్ణకి ఇస్తుంటారు. ధాన్యలక్ష్మి మాత్రం నసుగుతు ప్రకాష్ ని తన లిస్ట్ ని అపర్ణకి ఇవ్వమని అంటుంది. నువ్వే వెళ్లి ఇచ్చుకోమని ప్రకాష్ చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసిన అపర్ణ.. నాకు ఇవ్వడానికి నీకు అహం అడ్డు వస్తుందా? నీ పని చెప్తానని అపర్ణ అనుకొని కావ్యని పిలుస్తుంది.

ఆ తర్వాత నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నానని కావ్యతో అపర్ణ అంటుంది. ఈ దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటి బాధ్యతలు ఇస్తున్నాను.. ఇది నా రిక్వెస్ట్ కాదు అజ్ఞ అని అపర్ణ అనగానే.. రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మి షాక్ అవుతారు. ఇదిగో లాకర్ కీస్ ఇక నుండి ఈ ఇంట్లో ఎవరికేం అవసరం అయిన నీ దగ్గరికి రావాలని అపర్ణ అంటుంది. మంచి నిర్ణయమంటు కళ్యాణ్ వచ్చి.. తన లిస్ట్ ఇస్తాడు. అనామిక లిస్ట్ ఇవ్వలేదని కావ్య అడుగుతుంది. నాకు అవసరం లేదు. నా పుట్టింటి వాళ్ళు నాకు అన్నీ పంపారని అనామిక అనగానే.. అపర్ణ, ఇందిరాదేవీలు మేమ్ తీసుకొని రాలేమా అంటూ కోప్పడతారు. పంపిన వస్తువులు అన్నీ వెనక్కి పంపని కళ్యాణ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కోపంగా తన లిస్ట్ స్లిప్ కావ్యకి ఇవ్వకుండా కిందపడేసి వెళ్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ తీసుకొని కావ్య వెళ్ళిపోతుంది. నీకు కోపం వస్తుందా అని అనామికని రుద్రాణి అడుగుతుంది. ఇంట్లో నాదే పెత్తనం ఉండాలి అనుకున్నా కానీ ఇలా జరిగిందని అనామిక అంటుంది. నేను చెప్పినట్టు చేస్తే అది అవుతుంది. ఆ కావ్యని ఎలా ఇరికించాలో నాకు తెలుసంటు రుద్రాణి అనగానే.. సరే అని అనామిక అంటుంది. ఆ తర్వాత అప్పు ఇనిస్టిట్యూట్ లో జాయిన్ కావడానికి కృష్ణమూర్తిని తీసుకొని వెళ్తుంది. కానీ అక్కడ ఒక అతను డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తానని అంటాడు. దాంతో అప్పు వాడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

ఆ తర్వాత అనామికకి కళ్యాణ్ దగ్గర వెళ్తుంటే.. ఏదైనా నాకు నచ్చిన పనికి చేస్తేనే అని అనామిక అంటుంది. నువ్వు రోజు ఆఫీస్ కి వెళ్తేనే అని అనామిక అనగానే.. సరే వెళ్తానని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు శ్వేతతో రాజ్ ఫోన్ మాట్లాడి వెళ్తుంటాడు. అది విన్న కావ్య తన వెనక వెళ్ళాలని హడావిడిగా రెడీ అవుతుంటుంది. అప్పుడే కావ్యని రుద్రాణి మాటల్లో పెట్టి లాకర్ కీస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఉంటుంది. ఆ కావ్యకి ఇక ఉంటుందని అనామిక రుద్రాణీ ఇద్దరు అనుకుంటారు. తరువాయి భాగంలో కావ్యని గమనించిన రాజ్.. నీకు విడాకులు వచ్చాయి కదా శ్వేత.. నేను తీసుకుంటాను.. మనిమిద్దరం పెళ్లి చేసుకుందామని అనగానే అది కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.