English | Telugu

అందానికి ఆధార్ కార్డు ఆమె...ఆమెలో ఉన్నది బ్యూటీ వైరస్ ...


అందానికి ఆధార్ కార్డు ఆమె...ఆమెలో ఉన్నది బ్యూటీ వైరస్ ...డాన్స్ ఐకాన్ సీజన్ 2 మెగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ షోకి శివగామి రమ్యకృష్ణ వచ్చింది. రమ్యకృష్ణ గురించి చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. ఆమె స్టైల్ , ఆమె స్వాగ్ అదిరిపోతోంది. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. రావడమే ఓంకార్ అటు కంటెస్టెంట్స్ ని ఇటు జడ్జెస్ ని, మరో వైపు మెంటార్స్ ని పరిచయం చేశారు. రమ్యకృష్ణ వాళ్లందరికీ హాయ్ చెప్పింది.

ఇక దీపికా మీద ఆమె చూపు పడిందో లేదో దీపికా డైలాగుల వర్షం కురిపించింది. "నేను ఎయిర్ ని రిప్రెజెంట్ చేస్తున్న మెంటార్ ని. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడితే అది లార్డ్ కృష్ణ..అదే అమ్మాయిలు , అబ్బాయిలు కలిసి ఇష్టపడుతున్నారంటే అది రమ్య కృష్ణ." అంటూ ఆమె గురించి చెప్పేసరికి రమ్య కృష్ణ కూడా షాకయ్యింది. స్టేజి మీద ఉన్న వాళ్లంతా కూడా నవ్వేశారు. అంతటితో ఆగలేదు దీపికా. "మీ బాడీలో వైరస్ ఉంది మేడం" అని మళ్ళీ షాకింగ్ డైలాగ్ వేసేసరికి రమ్య కృష్ణ భయపడుతూనే ఏ వైరస్ అని అడిగింది. "బ్యూటీ వైరస్" అనేసింది దీపికా. ఆ ఆన్సర్ కి రమ్య కృష్ణ నవ్వుకోలేక పోయింది. "ఎన్ని సంవత్సరాలైనా ఆ స్టైల్ ఆ అందం అమ్మో..అందం ఆధార్ కార్డు తీసుకుని మీ ఇంట్లోనే ఉండిపోయింది..అందుకే మాకు అందం దొరకలేదు " అని ఆపకుండా చెప్తున్నా డైలాగ్స్ కి రమ్య కృష్ణ కూడా బాబోయ్ నువ్వు ఎయిర్ కాదు తల్లి నువ్వే ఫైర్ అనేసింది. ఆమె డైలాగ్స్ కి రమ్యకృష్ణ కూడా "థాంక్యూ నేను నీ మాటలకు చాలా ఇంప్రెస్ ఐపోయాను" అనేసరికి "నేను మీ అందానికి బాగా ఇంప్రెస్ ఐపోయాను మేడం" అంది దీపికా. ":నేను కూడా నీ అందానికి ఇంప్రెస్ ఐపోయాను" అని రమ్యకృష్ణ కూడా ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.