English | Telugu
నాకు ఒక పెళ్లి కూడా అవ్వట్లేదు.. మీకు పెళ్లి.. మళ్లీ పెళ్లి ఎలా ?
Updated : Sep 1, 2023
త్వరలో వినాయకచవితి పండగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో 'స్వామి రారా' అంటూ ఓ స్పెషల్ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోలో పలువురు సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రెటీలూ అందరూ పాల్గొని ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ షోకి నరేష్ -పవిత్ర లోకేశ్ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. అలాగే హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, చాందినీ చౌదరి , డైరెక్టర్ బలగం వేణుని కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. యాంకర్ శ్రీముఖి షోకి హోస్ట్ గా చేసింది. సీరియల్ యాక్టర్ మానస్ , రీతూ చౌదరి, వర్షతో పాటు, అన్నపూర్ణమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు కూడా ప్రోమోలో మెరిశారు. ఫారియా అబ్దుల్లా మాత్రం స్టేజి మీద బులెట్ డ్రైవ్ చేసుకుంటూ మంచి ఫన్ క్రియేట్ చేసింది.
ఇక ప్రోమో ఎండింగ్ లో హైపర్ ఆది వేసిన డైలాగ్ ఈ ప్రోమోకి హైలైట్ గా నిలిచింది. నరేశ్ దగ్గర వెళ్లి "నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు.. పెళ్లి.. మళ్లీ పెళ్లి ఎలా సార్.." అని అడిగాడు. నరేష్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆది భుజం మీద చెయ్యేసి నవ్వేశారు. వీళ్లిద్దరో ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ ఐన విషయం తెలిసిందే. రీసెంట్ గా తన పెళ్లి వ్యవహారం, విడాకుల ఇష్యూ, పవిత్ర లోకేశ్‌తో ప్రేమాయణం మొత్తాన్ని కలిపి 'మళ్లీ పెళ్లి' అంటూ ఓ మూవీ కూడా తీశారు. ఇందులో నరేశ్-పవిత్ర లోకేశ్ కలిసి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి ప్రొమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేంతవరకు మంచి హైప్ క్రియేట్ చేశారు ఇద్దరు. ప్రతీ ప్రమోషన్ లో స్టేజి మీద ముద్దులు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా . మొత్తానికి ఈ మూవీ రిలీజ్ అయ్యింది కానీ పెద్దగా కలెక్షన్స్ లేవు . మరి చూడాలి ఈ షోలో ఇంతకు నరేష్ ఎం ఆన్సర్ చెప్పారు అలాగే పవిత్ర ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయం.