English | Telugu
బ్రో వెర్సెస్ స్లమ్ డాగ్ హజ్బెండ్
Updated : Jul 20, 2023
"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "స్లమ్ డాగ్ హజ్బెండ్" మూవీ నుంచి బ్రహ్మాజీ, సంజయ్, ప్రణవి మానుకొండ వచ్చారు. బ్రాహ్మాజి రావడంతోనే ఆలీ కాళ్ళ మీద పడ్డారు.."ఎక్స్పెక్ట్ చేయలేదు..ఇంత వయసొచ్చినా కూడా" అని ఆలీ అనేసరికి "వయసేమిట్రా" అన్నారు బ్రహ్మాజీ. తర్వాత బ్రహ్మాజీ కొడుకు సంజయ్ వచ్చాడు. "నాన్న లాగ నువ్వు లేవు..మనం యూత్ ఇక్కడ" అని ఆలీ అనేసరికి "ఆయన యూత్ నెస్ చూసి నేను ఓల్డ్ ఐపోతున్న" అన్నాడు కామెడీగా. స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అని ఆలీ అడిగారు. జులై 29 న అని బ్రహ్మాజీ చెప్పారు. దానికి ఆలీ 28 న ఎవరి సినిమా రిలీజో తెలుసా నీకు అని అడిగారు "బ్రో" అని చెప్తూ పవన్ కళ్యాణ్ మానరిజమ్ ని చేసి చూపించారు బ్రహ్మాజీ బ్రో వెర్సెస్ స్లమ్ డాగ్ హజ్బెండ్ అని రెండిటినీ కనెక్ట్ చేశారు.
తర్వాత ఈ ముగ్గురితో గేమ్ షో ఆడించారు ఆలీ.."నువ్వు గేమ్ ని గేమ్ లా ఆడు అంతేకాని నాన్నను గెలిపించాలని ట్రై చేయకు" అని ఆలీ సంజయ్ కి వార్నింగ్ ఇచ్చేసరికి "ఇప్పుడు వాడు అడ్వాంటేజ్ తీసుకుని నన్ను గెలిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు..ఆడలేక" అన్నారు బ్రహ్మాజీ. "నువ్వు ఈ గేమ్ లో రెండు లక్షలు గెలుచుకున్నావ్ " అని ఆలీ చెప్పేసరికి "ఇచ్చేయి" అన్నారు బ్రహ్మాజీ. "నేను డబ్బులు కట్ట కట్టి క్యారవాన్ లో పెట్టాను..ఆ కట్ట నువ్వు తీసుకెళ్ళు" అన్నారు అలీ. తర్వాత వీళ్ళ చేత ఎన్నో గేమ్స్ ఆడించాడు ఆలీ. "సిత్తరాల సిరపడు" అనే సాంగ్ కి ఆలీ డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు.