English | Telugu

Brahmamudi : నందగోపాల్ ని మర్డర్ చేయించిన అనామిక.. కావ్య, రాజ్ లకి తప్పని తిప్పలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -625 లో... నిన్ను చూస్తే మేడమ్ సర్ మేడమ్ అంతే అనాలనిపిస్తుందని కావ్యతో రాజ్ అంటాడు. కావ్య మురిసిపోతు మీరు తిట్టిన బాగుంటుంది కానీ పొగిడితేనే ఏదో అవుతుందని అంటుంది. అప్పుడే రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి.. నందగోపాల్ ఎక్కడున్నాడో తెలిసిందని చెప్పగానే వస్తున్నామని రాజ్ చెప్తాడు. వాడిని పట్టుకొని మన డబ్బు మనం సొంతం చేసుకుందామని కావ్యతో రాజ్ చెప్తాడు. ఇక ఇద్దరు బయలుదేరి కిందకి వస్తారు.

వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మి ఆగమని చెప్తుంది. తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ సుభాష్ కి ఇచ్చి చదవమంటుంది. అందులో ఏముందో చెప్పండి బావగారు అని ధాన్యలక్ష్మి అంటుంది. సుభాష్ సైలెంట్ గా ఉండడంతో మీరు మీ కోడలు గురించి ఏం చెప్పరు.. నేనే చెప్తాను మావయ్య గారు నమ్మి తనకు ఆస్తులు అప్పజెప్పితే దుగ్గిరాల పరువుతీస్తూ గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. రాజ్ నీకు ఈ విషయం తెలుసా అని ఇందిరాదేవి అడుగుతుంది. తెలుసు నాకు చెప్పకుండా కావ్య ఏం పని చెయ్యదని రాజ్ అంటాడు. వాళ్లు ఏదో అవసరం వచ్చి పెట్టి ఉంటారని ఇందిరాదేవి సమర్థిస్తుంటే.. రుద్రాణి చూడలేక ఇంత సింపుల్ గా తీసేస్తావేంటని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు నిజం ఎందుకు చెప్తారు.. చెప్పరంటూ అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు అసలు నిజం తెలియాలని ధాన్యలక్ష్మి పట్టు పట్టుకొని కూర్చొని ఉంటుంది. దాంతో మేము అర్జెంట్ గా బయటకు వెళ్తాన్నాం.. వచ్చాక చెప్తామని రాజ్ చెప్తాడు.

ఆ తర్వాత రాజ్, కావ్య వెళ్ళిపోయాక.. అసలు మీకు ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి అత్త.. మీరు రాజ్, కావ్య వెనకాల ఏదైనా గూఢచారిలా చేస్తున్నారా ఈ విషయం కూడా తెలుసుకోవాలని స్వప్న అనగానే.. రాహుల్, రుద్రాణిలు పైకి వెళ్తారు. రాజ్, కావ్యలు నందగోపాల్ ఉన్నా చోటుకి వెళ్తారు. రాజ్ రౌడీ లని కొట్టడానికి రెడీ అవుతుంటే.. మీరు ఆగండీ అంటూ కావ్య రౌడీలతో కూల్ గా మాట్లాడి డీల్ చేస్తుంది. తరువాయి భాగంలో నందగోపాల్ ని పోలీస్ లకి పట్టిస్తారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి సమాధానం దొరికిందా అని రాజ్ అనగానే దొరికినట్లే ఉందని కావ్య అంటుంది. కళ్ళు ముందే కన్పిస్తుంది కదా అని రాజ్ అంటాడు. అంతలోనే పోలీసులు తీసుకొని వెళ్తున్న నందగోపాల్ ని ఒకతను వచ్చి షూట్ చేస్తాడు. ఇక నందగోపాల్ ని చూసి సారీ రాజ్.. నంద గోపాల్ చనిపోయాడని తన పోలీస్ ఫ్రెండ్ చెప్తాడు. రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.