English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ పదిలక్షలు ఎలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -602 లో..... ప్రకాష్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. కావ్య పెత్తనం నచ్చాడం లేదనీ చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి పైన కోప్పడతాడు ప్రకాష్. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి.. నేను చేస్తుంది తప్పంటారా అని అడుగుతుంది. నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్ కానీ ఇంట్లో వాళ్ళకే తిండి విషయం మనలో ఇలా చేస్తన్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఏంటని అడగను.. చెప్పే అవసరం ఉంటే చెప్పే దానివి అని అపర్ణ అంటుంది. అవును అత్తయ్య బలమైన కారణం ఉంది చెప్పాలిసిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని కావ్య అంటుంది.

మరొకవైపు రుద్రాణి వాళ్లు తమకి నచ్చిన టిఫన్స్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. అప్పుడే కావ్య వస్తుంది. కావాలనే కావ్య ముందు అది బాగుంది. ఇది బాగుంది అంటూ తింటారు. వీళ్ళు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత సీతారామయ్యని చూస్తూ ఇందిరాదేవి బాధపడుతుంది. కావ్య, రాజ్ లు వస్తారు. సీతారామయ్య హాస్పిటల్ బిల్ కళ్యాణ్ కి రాజ్ ఇచ్చి పే చెయ్యమంటాడు. ఆ తర్వాత పని మనిషిని ఏం వంటలు చేసావని రుద్రాణి అడుగుతుంది. తోటకూర అని చెప్పగానే.. వద్దని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు గదిలోకి వెళ్లి ఆర్డర్ పెట్టుకుంటారు కానీ వాళ్ళ కార్డ్స్ పని చెయ్యవ్.

ఆ తర్వాత సుభాష్ కి వెళ్లి చెప్తారు. సుభాష్ బ్యాంకుకి ఫోన్ చెయ్యగా. అవును బ్లాక్ అయ్యాయి కావ్య గారు చేయించారని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కోపంగా ఉంటారు.కావ్య, రాజ్ లు ఇంటికి వస్తుంటారు. అప్పుడే బ్యాంకు నుండి ఒకతను ఫోన్ చేసి మీరు చెక్కు పంపారు కదా బాలెన్స్ లేవని అంటాడు. ఆ తర్వాత మేనేజర్ కి ఫోన్ చేసి ఎంత డ్రా చేశారని అడుగుతాడు. మీరు ట్వంటీ లాక్స్ అన్నారు కానీ ఫిఫ్టీ లాక్స్ ఉన్నాయ్ అవే డ్రా చేసామని అంటాడు. ఆ తర్వాత మిగతా టెన్ లాక్స్ ఏం అయ్యాయని కావ్య, రాజ్ ఆలోచిస్తారు. స్వప్న అక్కకి టెన్ లాక్స్ చెక్ ఇచ్చాను కదా తనేమైన డ్రా చేసిందా అని కావ్య అనగానే.. అలా చెయ్యదని రాజ్ అంటాడు. స్వప్నకి కావ్య ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చెయ్యదు. మరొకవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణిలకి ఆకలి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.