English | Telugu

ఎమోషన్స్ తో ప్రోమో ..? క్లిక్ అయ్యేనా ?

బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 5 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 6 స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. లాస్ట్ సీజన్ లాగే ఓటిటిలో 24 అవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం చేయడానికి రంగం సిద్దమయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించి అప్ డేట్స్ జనాల్లో మంచి హైప్ తీసుకొస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు సీజన్ 6 ప్రోమో బిగ్ బాస్ ప్రోమో బయటికి రిలీజ్ చేసేసారు. 55 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోలో జనం బిగ్ బాస్ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో చెప్పడానికి ప్రయత్నించారు.

బుల్లితెర మీద భారీగా పాపులర్ ఐన షో గా పేరుతెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 6 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. కూతురుకు పెళ్లి చేసి అప్పగింతలు ఇవ్వాల్సిన టైంలో పేరెంట్స్ ఫీలింగ్స్ చూపించి ఆ తర్వాత సీన్ లో కూతురు అప్పగింతల కార్యక్రమం కంటే ముందుగానే ఆ పేరెంట్స్ బిగ్ బాస్ షో చూడడానికి వెళ్ళిపోతారు. కూతురు ఆనందం కంటే బిగ్ బాస్ ముఖ్యం అన్నట్లుగా ప్రోమోలో చూపించారు మేకర్స్. కూతురు చేతులు పట్టుకుని బాధపడుతున్న ఆ పేరెంట్స్ బిగ్ బాస్ వస్తున్నట్లుగా ఒక మొబైల్ అలెర్ట్ వచ్చేసరికి కూతురిని అక్కడే వదిలేసి వెళ్లి టీవీ ముందు కూర్చుండిపోతారు.

తర్వాత అప్పగింతలు కార్యక్రమానికి నాగార్జున ఎంట్రీ ఇచ్చి అప్పగింతలు అయ్యేవరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అని చెప్పడం ఆడియన్స్ కి పెద్ద నచ్చలేదు. ఎమోషన్స్ తో ప్రోమో చేశారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే లైఫ్ లో ఏ మొమెంట్ ఐనాసరే బిగ్ బాస్ తర్వాతే అని నాగ్ చెప్పడం అంత బాలేదంటున్నారు జనం. దీనెమ్మా జీవితం కన్నవాళ్ళకు కూతురు కంటే బిగ్ బాస్ ఎక్కువా ????... ఏమన్నా లాజిక్కా.. అంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోపై జనం పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదనేది నిజం.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.