English | Telugu

Bigg boss 9 Telugu : కెప్టెన్సీ టాస్క్ లో పోటాపోటీ.. గెలిచిందెవరంటే!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రెండవ రోజు కొనసాగింది. నిన్న జరిగిన టాస్క్ లో ఓనర్స్ విన్ అయ్యారు.ఈ రోజు టాస్క్.. బజర్ ఆర్ నో బజర్. ఇందులో బిగ్ బాస్ ఇరు టీమ్ లకి అరగంట టైమ్ ఇస్తాడు. ఆ లోపు ఎవరు బజర్ కొడతారో.. వాళ్లకు స్లీప్ లెస్ అవర్ లో గంట టైమర్ తగ్గుతుంది.

అలా ఇద్దరు బజర్ కొడితే ఇద్దరికి ఒక గంట పెరుగుతుంది. అలా ఏ విషయమైనా ఇరు టీమ్ లకి టెలీఫోన్ లో మాట్లాడే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్తాడు. ఓనర్స్ లో కళ్యాణ్.. రెంటర్స్ లో రీతు ఫోన్ మాట్లాడుకుంటారు. మీరు కొట్టొద్దు మేమ్ కొట్టమని అనుకుంటారు కానీ ఓనర్స్ లో శ్రీజ బజర్ కొడుతుంది. అలా అని రెంటర్స్ కూడా కొట్టకుండా లేరు.. వాళ్ళు చివరి నిమిషంలో కొట్టారు.

చివరికి వచ్చేసరికి ఇరు టీమ్ లు.. టాస్క్ లో ఒకరికి తెలియకుండా ఒకరు కొట్టారు. ఇద్దరు టాస్క్ లో ఫెయిల్ అయి ఇద్దరికి గంట స్లీప్ లెస్ అవర్ పెరుగుతుంది. అప్పటికి కూడా ఓనర్స్ తక్కువ స్లీప్ లెస్ అవర్ లో ఉన్నారు. వాళ్ల టైమర్ ముందు జీరోకి వచ్చింది కాబట్టి వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.