English | Telugu

ఎలిమినేషన్ ముందే ఊహించిన సోనియా.. స్ట్రాంగ్ ఉండమని నిఖిల్ కి టిప్!


బిగ్ బాస్ సీజన్-8 లో ఓ కంటెస్టెంట్ ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించారంటే అది సోనియా ఆకుల. హౌస్ నుంచి మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ వార్త ముందే బయటకు వచ్చేయడంతో.. అసలు ఆమె ఎలిమినేట్ అయిన తరువాత రియాక్షన్ ఏంటని.. ఎవరి గురించి ఏమి మాట్లాడిందో చూడాలని ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూశారు.

సోనియా ఎలిమినేషన్ అయ్యాక నాగార్జున దగ్గరికి వచ్చేసింది సోనియా. హౌ ఆర్ యూ సోనియా అనగానే.. ఎనీ ఫీలింగ్ అని నాగార్జున అనగా.. అదేం లేదు సర్.. ఈ ఎలిమినేషన్‌ని ముందే ఊహించానని సోనియా అంది. ఇక తన జర్నీ చూసి నాగార్జున.. బ్యూటిఫుల్ జర్నీ సోనియా.. హ్యాపీ‌ మూమెంట్స్ , సాడ్ మూమెంట్స్ ఉన్నాయని నాగ్ అనగా.. గుడ్ వన్ సర్ అని సోనియా అంది. మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను.. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను.. నేను కాలేజ్‌లో కూడా అంతే.. నన్ను అంతగా ఇష్టపడరు. కానీ నేను మారను.. ఉన్నది ఉన్నట్లు చెబుతాను.. తప్పు అయితే తప్పు.. ఒప్పు అయితే ఒప్పు చెబుతాను.. అంటూ సోనియా చెబుతూ ఉంటే.. ‘హా.. అది చాలా మందికి నచ్చదు’ అంటారు నాగార్జున. నిఖిల్, పృధ్వీ.. ఇద్దరూ నేను చెప్పింది ఏది విననే వినరు.. నేను కేవలం ఇలా కాదు అని సలహా ఇవ్వడమే తప్ప.. వాళ్లు విననే వినరని సోనియా అంటుంది. ఆ తర్వాత 'మహాతాలి' మెనూ బోర్డ్ తెప్పిస్తాడు నాగార్జున. అందులో ఉన్న ఐటమ్స్ కి హౌస్ మేట్స్ ఎవరు సెట్ అవుతారో చెప్పమని నాగ్ మామ అడిగాడు.

పులిహోరా విష్ణుకే వెళ్తుంది సర్.. ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది. పులిహోరా కలుపుతూనే ఉంటుంది.. నచ్చకపోతే ఇక అంతే.. ఇంకేముండదిక.. అంది సోనియా. విష్ణు ఫొటోని పులిహోరాపై పెడుతూ. కాకరకాయ వేపుడు సీతూ సర్.. చేదు.. టక్ మని మాట్లాడేస్తుంది.. అండ్ తర్వాత ఇక మాట్లాడను ఇక అంతే ఇక అంటుంది. చేదుగా అంతే ఉంటుంది. ఆవకాయ.. ప్రేరణ. తను క్యూట్ అండ్ స్వీట్ కానీ.. తనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఏదొకటి అంటూనే ఉంటుంది.. నబీల్ రోటీలాగే.. సాఫ్ట్‌గానే ఉంటాడు. పైకి అలా కనిపిస్తాడు కానీ.. మంచివాడే.. కేవలం నామినేషన్స్‌లో అలా ఉంటాడు కానీ.. తను చాలా సాఫ్ట్ సర్ అంటుంది. పాయసం పృథ్వీ.. తనను అంతా ఇష్టపడుతుంటారు.. అలాగే నిఖిల్ అన్నం లెక్క.. అన్నం లేకపోతే ఏం లేదు.. అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు. యష్మీ చేపల పులుసు.. చాలా టఫ్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది కానీ తను చాలా నైస్ అండ్ ఎమోషనల్. అప్పడం నైనిక... అప్పడం అంటే త్వరగా సులువుగా విరిగిపోతుంది. మెంటల్ స్ట్రెంత్ కావాలి తనకి. వీళ్లు ఏమనుకుంటారు.. అలా అనుకోకని అంటుంది. ఇక ఆ తర్వాత నిఖిల్ ని లేపి.. ఏంటి నిఖిల్ అని నాగ్ అడగగా.. ఎమోషనల్ అవుతాడు. స్ట్రాంగ్ గా ఆడు అని సోనియా అంటుంది. ఇక అందరికి బై చెప్పేసి బయటకు వచ్చేస్తుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.