English | Telugu

సస్పెన్స్ కి తెరతీస్తూ బిగ్ బాస్ సీజన్-7 ప్రోమో!

బిగ్ బాస్ షో టెలివిజన్ లో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-7 కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతు విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా ఇందులో కంటెస్టెంట్స్ ఎంపిక అనేది కీలకమైన అంశం. ఎందుకంటే గత సీజన్లో కంటెస్టెంట్స్ ఎంపికపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్-7 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ సెట్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఇక హోస్ట్ విషయానికొస్తే మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేయగా, రెండవ సీజన్ నేచురల్ స్టార్ నాని చేశాడు. గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున వ్యవహరించగా.. ఈ సీజన్ కి నాగార్జున నో చెప్పాడంటు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్-7 ప్రోమోలో తెలుస్తుంది.

గత కొంతకాలంగా హోస్ట్ విషయంలో అనుమానాలు ఉన్నాయి. కాగా వాటికి తెరతీస్తూ ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నట్లుగా బిగ్ బాస్ సీజన్-7 ప్రోమోని స్టార్ మా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంటుందోనని హింట్ ఇచ్చి వదిలేసాడు. ఈ సారి సీజన్ కొత్తగా ఉంటుందని చెప్తూ ఆగిపోయి.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని నాగార్జున అన్నాడు. దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలని బిగ్ బాస్ ప్రియులకు క్యూరియాసిటిని పెంచేశారు మేకర్స్. కాగా ఈసారి ఎవరు ఊహించని విధంగా ఉంటుందేమో‌ని తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.