English | Telugu

నాగార్జున చెప్పిన కుడి ఎడమైతే అర్థం ఏంటో తెలుసా?!

బిగ్ బాస్ సీజన్-7 ప్రోమో రానే వచ్చింది. ఎప్పుడెప్పుడ అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో నాగార్జున 'కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్' అని పాడి ఆపేశాడు. దీని వెనుక ఏదో ఉందని తెలుస్తోంది.

అదేంటంటే ఇప్పటివరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు ఒకే ఫార్మట్ లో జరిగింది. ఈసారి ఆ జరిగే ప్రక్రియను, ఇందులో ఇచ్చే టాస్క్ లని, వీక్ ఎలిమినేషన్, కంటెస్టెంట్స్ ఎంట్రీ అంతా మార్చేస్తారేమో. మరి కొత్తగా ఏం చేస్తారంటే.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలను తీసుకోవచ్చు. ఫలానా కేటగిరీ అంటూ ఏం లేకుండా సోషల్ మీడియాలో‌ ఎక్కువ ట్రెండింగ్ లొ ఉండి, కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ సీజన్-7 కి సెలెక్ట్ చేసేలా ఉన్నారు. ఇంకా ఆ గేమ్స్ కూడా అవే పాత రొట్ట గేమ్స్ కాకుండా ఎవరూ ఊహించని గేమ్స్, ఛాలెంజెస్ ఇస్తారు కావచ్చు.

బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్, టికెట్ టూ ఫినాలే, ఫ్యామిలీ మీట్, హోటల్ టాస్క్, చేపల టాస్క్, ఇలా అన్నీ కామన్ గా ఉంటున్నాయి. గత సీజన్ లో అయితే ఎంటర్టైన్మెంట్ లేదని కంటెస్టెంట్స్ ని బయటకు పంపే పరిస్థితి వచ్చింది. ఇది ఈ సీజన్ కూడా ఇలాగే సాగితే బిగ్ బాస్ కి టీఆర్పీ తగ్గిపోతుందని భావిస్తున్నట్టున్నారు మేకర్స్. దాంతో ఈ సారి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. నాగార్జున చెప్పిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అన్న దానికి అర్థం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.