English | Telugu

బిగ్ బాస్ ప్రేక్షకులను హత్తుకున్న కంటెస్టెంట్స్ కోరికలు!

ముప్పై రెండవ రోజు' లైలా ఓ లైల' పాటకి, కంటెస్టెంట్స్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో హుషారుగా మొదలైంది బిగ్ బాస్.

నిన్నటి దాకా 'బిగ్ బాస్ పుట్టిన రోజు' వేడుకలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ అభినందించాడు. "హౌస్ మేట్స్ అందరు తమ కోరికలు ఏంటో ఒక పేపర్ మీద రాసి, గార్డెన్ ఏరియాలో ఉన్న బావిలో పడేయండి" అని బిగ్ బాస్ తెలియజేసాడు. మొదట శ్రీహాన్ వచ్చి సిరి గురించి ఎమోషనల్ అయ్యాడు. "నువ్వు షూట్స్ లో బిజీగా ఉంటావని తెలుసు కానీ మా అమ్మ నాన్నలకి రోజుకి ఒక్కసారైనా కాల్ చెయ్. నేను లేని లోటును తీర్చు" అని కంటతడి పెట్టుకున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత సుదీప తన భర్త 'రంగనాథ్' టీ షర్ట్ మరియు ఫోటో కావాలని అడిగింది. తర్వాత రేవంత్ తన భార్యని బాగా చూసుకొమని వాళ్ళ అమ్మనాన్నకి చెప్పుకున్నాడు. "నేను ఇక్కడికి వచ్చే వారం ముందే పాప పుట్టింది. పాపకి మంచి పేరు పెట్టాలని ఉందని, నేను ముద్దుగా బుజ్జమ్మా అని పిలుచుకుంటున్నా" అని ఏడ్చేసాడు ఆదిత్య.

అర్జున్ వాళ్ళ నాన్నకి డయాబెటిస్. తనకి స్నేహితులు ఎవరు లేరని, నాన్నని జాగ్రత్తగా చూసుకోండని ఏడ్చేసాడు. ఆ తర్వాత సూర్య, "నా బుజ్జమ్మ‌ గురించి, నాన్న గురించి, అమ్మ‌ గురించి ఒక వీడియో చేయమని, వీడియోలో కాస్త ఎక్కువగా మా నాన్నని మాట్లాడమని చెప్పండి" అని ఏడ్చేసాడు.ఇనయా మాట్లాడుతూ, "మమ్మీ , నాన్న కన్నా ఎక్కువగా నేను నిన్ను చూసుకోలేను. కానీ ఇక్కడికి ఒక్కసారి రా అమ్మ" అంటూ ఏడుస్తూ చెప్పుకుంది ఇనయా. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి తమ‌ కోరికలను చెప్పుకొని బాగా ఎమోషనల్ అయ్యారు.

కెప్టెన్ కీర్తి భట్ ని, "కెప్టెన్ పోటీదారులు ఎవరు?" అని బిగ్ బాస్ అడుగగా, "ఫైమా, రేవంత్, సూర్య, గీతు, ఆదిత్య, రాజ్" అని చెప్పింది. "కెప్టెన్సీ పోటీ రెండు లెవల్స్ ఉంటుంది. మొదటి లెవల్ గెలిచిన వారికి రెండవ లెవల్ ఉంటుంది" అని వివరించాడు బిగ్ బాస్. కాగా ఈ పోటీలో సూర్య, ఆదిత్య, రేవంత్ గెలిచారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు? తర్వాత లెవల్ లో గెలిచి, కెప్టెన్ అవుతారో చూడాలి మరి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.