English | Telugu
కంటెస్టెంట్స్ మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు సాగిన టాస్క్!
Updated : Oct 21, 2022
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ భాగంగా కంటెస్టెంట్స్ ఫుడ్ కోసం నిన్నటి వరకు ఆటలో పాల్గొన్నారు. కాగా బిగ్ బాస్ ఆదేశానుసారం అందరిని ఇప్పటి నుండి హౌస్ లో ఉండడం కోసం టాస్క్ ఆడమని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ ఫుల్ జోష్ తో గేమ్ అడడానికి సిద్ధం అయ్యారు.
కెప్టెన్సీ టాస్క్ రద్దు కారణంగా పనిష్మెంట్ తీసుకోవడం మంచిదే అయింది. ఇప్పుడు అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే టాస్క్ లో అందరు వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ టాస్క్ లో ఫిజికల్ అవ్వడం, ఒకరినొకరు తిట్టుకోవడం. ఇదంతా చూసే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది అని చెప్పడం లో సందేహం లేదు. నిన్న జరిగిన టాస్క్ లో రేవంత్ పేరు ఎక్కువ సార్లు వినిపించింది. శ్రీసత్య ప్రతీసారి రేవంత్ ని టార్గెట్ చేసినట్టు తెలుసింది. అలాగే మెరీనా, శ్రీహాన్ మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
అప్పటికే హౌస్ రెండు గ్రూప్ లుగా ఉన్నా విషయం తెలిసిందే. కాగా ఇరు గ్రూపులు కూడా నువ్వా నేనా అంటు టాస్క్ ఆడుతున్నారు. రేవంత్ శ్రీసత్య మధ్య కొంత వాగ్వాదం జరిగింది. "ప్రతీసారి నువ్వు నన్నే టార్గెట్ చేసి అంటున్నావ్. నేను చూస్తున్నాను" అని రేవంత్ అనగా, "అదేం లేదు నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావ్. నువ్వు ఫేయిర్ గేమ్ ఆడట్లేదు " అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అర్జున్, పైమాను తోసేసాడు. అది చూసిన రేవంత్, "ఎవరు అడ్డమొస్తే వారిని తోసిపడదొబ్బు" అని అన్నాడు. అది విన్న శ్రీసత్య, "ఫార్మల్ వర్డ్స్ వాడు" అని రేవంత్ తో చెప్పింది. "తోసిపడదొబ్బు, ఏసిపడదొబ్బు అంటే ఎవరు పడేలా లేరు ఇక్కడ. చూసుకొని మట్లాడు" అని శ్రీసత్య, రేవంత్ తో చెప్పగా, అలాగే "మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు" అని రేవంత్ అన్నాడు.
శ్రీహాన్, శ్రీసత్య మధ్య ఆర్గుమెంట్ కొనసాగగా, శ్రీహాన్, అర్జున్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. "నువ్వు నా కాళ్ళు పట్టుకొని లాగావ్ అది ఫిజికల్ కాదా" అని అర్జున్ అనగా, "నువ్వు నన్ను లాగేసావ్. ఇది ఫిజికల్ కాదా" అని శ్రీహాన్ చెప్పాడు. కాసేపు ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఇందులో శ్రీహాన్, అర్జున్ తో దమ్ముంటే అడ్డుకో అన్నాడు. " ఆ నేను చూస్తా, నువ్వెలా అడ్డుకుంటావో" అని అర్జున్ అన్నాడు.