English | Telugu
ఉదయకిరణ్ తో కలిసి 5 సినిమాలకు సైన్ చేసాను!
Updated : Oct 24, 2022
'నువ్వు నాకు నచ్చావ్' మూవీతో సుదీప పేరు కాస్తా పింకీగా మారిపోయింది. అప్పట్లో ఈ మూవీ ఎంత సూపర్ హిట్టో పింకీ యాక్షన్ మాత్రమే కాదు ఆమె పేరు కూడా అంత హిట్ కొట్టింది. ఇక ఇన్నేళ్ల తర్వాత సుదీప అలియాస్ పింకీ బిగ్ బాస్ హౌస్ ద్వారా మళ్ళీ లైం లైట్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక ఎన్నో విషయాలు చెప్పింది. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చింది. అలాగే ఇదే సందర్భంలో మరణించిన హీరో ఉదయ్ కిరణ్ గురించి కూడా కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
"ఉదయ్ కిరణ్ ది చాలా సాఫ్ట్ నేచర్. ఎవరైనా కొంచెం డల్ గా కనిపిస్తే దగ్గరకొచ్చి అన్ని కనుక్కునేవారు. చాలా మంచి మనిషి. భౌతికంగా ఆయన లేకపోయినా అందరి మనస్సులో ఉండిపోయారు" అని సుదీప ఎమోషనల్ అయ్యారు. "ఉదయ్ కిరణ్ తో నేను నటించిన లాస్ట్ మూవీ 'వియ్యాల వారి కయ్యాలు'. ఉదయ్ కిరణ్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళంలో కలిపి తొమ్మిది చిత్రాలు మొదలయ్యాయి... అయితే వాటిల్లో చాలా వరకు ఆగిపోయాయి. ఒక ఐదు చిత్రాలకు నేను కూడా సైన్ చేశాను. ఇక నేను మూవీస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాను అంటే ..మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఎం.ధర్మరాజు ఎంఏ మూవీ షూటింగ్ గోదావరిలో జరుగుతున్నప్పుడు ఆ మూవీలో నటించాల్సిన చైల్డ్ ఆర్టిస్ట్ రాకపోయేసరికి ఆ మూవీ రైటర్ మా తాతయ్యకు బాగా పరిచయం. దాంతో ఆ టైములో ఆయనకు నా గురించి చెప్పడం ఈ సినిమాలో ఛాన్స్ రావడం జరిగింది. అలా హీరో, హీరోయిన్స్ చెల్లెలు పాత్రల్లో ఎక్కువగా చేసాను" అని చెప్పింది సుదీప.