English | Telugu

 కెప్టెన్సీ రేస్ నుండి తనూజ అవుట్.. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్!

బిగ్‌బాస్ సీజన్ -9 నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా లగ్జరీ ఫుడ్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్కులు పెట్టాడు. ఇందులో భాగంగా సభ్యులందరినీ మళ్లీ నాలుగు టీములుగా డివైడ్ చేసి టాస్కులు పెట్టాడు. ఇందులో గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా కొన్ని పవర్ కార్డ్స్ లభించనున్నాయి. నిన్న జరిగిన టాస్కు అయితే గట్టిగానే జరిగింది.

కెప్టెన్ డీమాన్ పవన్‌ని మళ్లీ సంచాలక్‌గా పెట్టి నాలుగు టీములుగా 12 మందిని డివైడ్ చేశాడు. హరీష్, తనూజ, రీతూ చౌదరి (బ్లూ టీమ్), ఇమ్మానుయేల్, ఫ్లోరా, కళ్యాణ్ (రెడ్ టీమ్), సంజన, రాము, సుమన్ శెట్టి (ఎల్లో టీమ్), శ్రీజ, దివ్య, భరణి (గ్రీన్ టీమ్)‌.. ఇలా నాలుగు టీములు టాస్కులో పోటీ పడ్డాయి. స్టార్ట్ బజర్ మోగగానే టీమ్ లీడర్స్ సమయానుసారం చెప్పిన కలర్ బాల్స్‌ని ఆ నెట్ నుంచి బయటికి తీయాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. వెంటనే బ్లూ అని బిగ్‌బాస్ చెప్పాడు.. దీంతో బ్లూ బాల్ అందుకోవడానికి టీమ్స్ అన్నీ తెగ తన్నుకున్నాయి. ఈ టాస్కులో రెడ్ టీమ్ సత్తా చాటింది. కెప్టెన్సీ కంటెండర్ షిప్ మాత్రమే కాదు లగ్జరీ ఐటెమ్ మరెన్నో ప్రయోజనాలు పవర్ కార్డ్స్ ద్వారా లభిస్తుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అందులో కంటెండర్, కిక్ ఔట్, మటన్, లగ్జరీ ఫుడ్.. అని నాలుగు కార్డ్స్ ఉన్నాయి. కంటెండర్ కార్డ్ తీసుకుంటే తమ టీమ్ నుంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట, కిక్ ఔట్ కార్డ్ పొందిన వారు వాళ్లకి నచ్చిన టీమ్‌ని రేసు నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. అలానే మటన్, లగ్జరీ ఫుడ్ కార్డ్స్ గెలిస్తే ఆయా సదుపాయాలు వస్తాయి. టాస్కులో భాగంగా కొంతమంది ప్లేయర్ల మధ్య ఫిజికల్ ఫైట్ అయింది. బ్లూ టీమ్‌లో ఉన్న తనూజ తనని మూతి మీద కొడుతున్నాడు.. అంటూ కళ్యాణ్ మీద కంప్లెయింట్ చేసింది. కావాలని కొట్టరు కదమ్మా.. అని ఇమ్మూ అంటే చేయి తగలడం డిఫరెంట్ ఇలా అనుకొని వెళ్లడం డిఫరెంట్ అంటూ ఎలా కొట్టాడో తనూజ చూపించింది‌.

మరోవైపు తమ బాస్కెట్‌లో ఉన్న బాల్‌ని తీయడానికి ట్రై చేసిన రీతూపై ఫైర్ అయ్యాడు కళ్యాణ్. బ్రో పెట్టు అక్కడ అంటూ రీతూకి చెప్పాడు కళ్యాణ్. తర్వాత తనూజ-కళ్యాణ్ మధ్య కూడా గొడవ జరిగింది. ఇక ఏ టీమ్ కారణంగా బ్లాక్ బాల్ బయటికొచ్చిందని మీరు అనుకుంటున్నారో ఆ టీమ్ నుంచి ఒకర్ని తప్పించండి అంటూ డీమాన్‌కి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తనూజ నువ్వు ఎలిమినేట్ అంటూ డీమాన్ అన్నాడు. అయితే కీ ప్లేయర్లని పంపించాలి.. సపోర్టర్స్‌ని పంపించడానికి లేదంటూ డీమాన్‌తో పవన్ కళ్యాణ్ గొడవపడ్డాడు. డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్టో కామెంట్ చేయండి.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.