English | Telugu

బిగ్ బాస్-7 హోస్ట్ గా రానా?

'ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్ లైన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్-6 ఎంతగా హిట్ అయ్యిందో మనందరికి తెలుసు. మరి ఇప్పుడు అదే తరహాలో సీజన్-7 అతిత్వరలో ప్రారంభం కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుందంట. ఒక్కో కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం అప్రోచ్ అవ్వడం, వారి డాటా అంతా కలెక్ట్ చెయ్యడం, ఇంకా బిగ్ బాస్ సెట్ రెడీ చెయ్యడం.. లాంటివి ఇప్పటి నుండి మొదలు పెడితే దాదాపు తొమ్మిది నెలలు పడుతుంది. మొదటి రెండు సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ లు గా వ్యవహరించగా, మిగతా నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసారు. అయితే తర్వాత జరిగే సీజన్ కి హోస్ట్ గా చెయ్యనని నాగార్జున చెప్పాడంట. దీంతో బిగ్ బాస్ టీం.. వేరే స్టార్ ని సంప్రదించారని తెలుస్తోంది. కాగా బిగ్ బాస్ టీం, హీరో రానాని సంప్రదించగా.. హోస్ట్ గా చేయడానికి ఆయన ఓకే చెప్పాడని వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున బిగ్ బాస్ ని ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారని, ఈ సీజన్-6 అయితే శని, ఆదివారాలలోనే ఎక్కువ మంది నాగార్జున హోస్టింగ్ చూశారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త హోస్ట్ అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.