English | Telugu
తన తుదిశ్వాస వరకు ఋణపడి ఉంటానని చెప్పిన రాజ్!
Updated : Jun 25, 2023
ముత్యాలు రాజ శేఖర్.. ఈ పేరు ఎవరికి తెలిసిఉండకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 లో రాజ్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. తన కామ్ అండ్ కూల్ నేచర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను తనవైపుకి తిప్పుకున్నాడు రాజ్.
రాజ్ ఒక మోడల్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి అడుగుపెట్టాడు. రాజ్ వాళ్ళ నాన్న 2009 లో చనిపోవడంతో తను చదువు మానేసి ఆఫీస్ బాయ్ గా చేసాడంట. ఆ తర్వాత చిన్న చితక జాబ్స్ చేస్తూ చదువుకున్నాడు. ఒక స్టేజ్ లో తనకి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చిందని, లివ్ వాట్ యూ లవ్ అనేది తను నమ్మాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాజ్. బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చాక తనలో చాలా మార్పు వచ్చింది. రాజ్ మొదట కీర్తభట్, ఇనయా సుల్తానాలతో ఎక్కువగా ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. దాంతో రాజ్ కి ఒక తోడులా, ఏది ఎలా మాట్లాడాలని, ఎవరు ఎలా ఉంటారో తెలియజేసింది ఫైమా. అయితే చలాకి చంటితో కలిసి కామెడీ చేసిన రాజ్.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను ఆకట్టున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు.. రాజ్ ఎక్కడున్నా రాజే అని నాగార్జున అనేవాడు. అలాగే రాజ్ రెగ్యులర్ గా వాడే ఊతపదం 'మినమం ఉంటది' అనేది ఎక్కువ ఫేమస్ అయింది. అయితే రాజ్ బిగ్ బాస్ తర్వాత తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అప్డేట్ లో ఉంటున్న రాజ్. తాజాగా బిగ్ బాస్ కి థాంక్స్ చెప్తూ ఒక నోట్ రాసాడు. 'నా లైఫ్ ని మిరాకిల్ గా మార్చావ్.. నా చివరి శ్వాస ఉన్నంతకాలం నీకు ఋణపడి ఉంటాను' అని రాజ్ ఆ పోస్ట్ లో చెప్పాడు. దాంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలుపుతూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.