English | Telugu

'కంటెస్టెంట్స్ ని బయటకు వెళ్ళిపోమన్న బిగ్ బాస్'!

నిన్న జరిగిన సెలబ్రిటీ లీగ్ టాస్క్ లో ఎవరు కూడా వారికి ఇచ్చిన సెలబ్రిటీ పాత్రకు సరైన న్యాయం చేయలేకపోవడంతో కంటెస్టెంట్స్ ని బయటకు వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్.

అయితే టాస్క్ లో పర్ఫామెన్స్ చేయడానికి కంటెస్టెంట్స్ వాటికి సంబంధించిన దుస్తులు మాత్రమే ధరించారు. కాని దానికి తగ్గట్టుగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ఎంత సేపటికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక, ఎక్కడ వాళ్ళు అక్కడే రిలాక్స్ గా ఉండిపోయారు. ఈ ఎపిసోడ్ చూసే ప్రేక్షకులకు ఎప్పుడు అయిపోతుంది రా అన్నట్లుగా పర్ఫామెన్స్ చేసారు కంటెస్టెంట్స్. ఏదో కబుర్లు చెప్పుకోడానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఎవరి పాత్ర లో వారు లేకుండ ఎప్పటికప్పుడు పాత్ర నుండి బయటకొస్తూ, కామెడిగా టాస్క్ ని చేస్తోన్నారు. ఇదంతా చుసిన బిగ్ బాస్ కి చాలానే కోపం వచ్చింది. ప్రేక్షకులకు కూడా ఇదేంటి ఏదో రిసార్ట్ కి వెళ్ళారా వీళ్ళు అనే అనుమానం రాలేదంటే వింత గానే ఉంటుంది. "హౌస్ మేట్స్ దేనిపై ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. హౌస్ లో ఫైమా, శ్రీహాన్, సూర్య, గీతు, రాజ్ వీళ్ళు మాత్రం ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా ఇంటి సభ్యులు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఆసక్తి లేని వారు హౌస్ నుండి బయటికి వెళ్ళండి" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.

మొట్ట మొదటి సారిగా బిగ్ బాస్ చరిత్ర లో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేయబడుతుంది అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరుఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చొని క్షమించమని అడిగారు. అయిన బిగ్ బాస్ వినకుండా మీరు ధరించిన వస్త్రాలు స్టోర్ రూమ్ లో పెట్టండి అని చెప్పాడు. దాంతో టాస్క్ లో పెర్ఫార్మన్స్ చెయ్యడానికి ప్రయత్నించిన ఫైమా, శ్రీహాన్, సూర్య, రాజ్, గీతు కెమెరా ముందుకు వచ్చి ఆడినవాళ్ళకి అన్యాయం జరుగుతోంది బిగ్ బాస్. ఈ ఒక్కసారి క్షమించండి అని అడిగారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.