English | Telugu
మొదటి రోజే ఫిట్టింగ్...సూట్ కేస్ ఆఫర్ చేసినప్పుడు తీసుకున్న బాగుండేది!
Updated : Sep 5, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా లాంచ్ అయి ప్రేక్షకుల అంచనాలు తారుమరు చేసింది. 21 మందిని హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి అయితే మిగతా కంటెస్టెంట్ లు నెక్స్ట్ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనునుట్లు తెలుస్తుంది. 14 మంది సండే రోజు జరిగిన గ్రాండ్ లాంచ్ లో ఎంట్రీ ఇవ్వగా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్ కోసం హీరో నవీన్ పొలిశెట్టిని హౌస్ లోకి పంపించగా.. హౌస్ లో కంటెస్టెంట్స్ ని కొద్దిసేపు సరదాగా ఆటపట్టించాడు నవీన్ పొలిశెట్టి.
బిగ్ బాస్ ఎవరినైనా హౌజ్ లోకి పంపిస్తున్నారంటే టాస్క్ అయిన ఫిట్టింగ్ అయిన కంపల్సరి అన్న విషయం తెలుస్తుంది. హౌజ్ లో ఉన్న మేల్ కంటెస్టంట్ ఎందరున్నారో అందరు.. ఫీమేల్ కంటెస్టెంట్ లోని ఒకరికి లక్కీ చామ్ గల బ్రాస్ లైట్ ఇవ్వాలి. అలా నవీన్ పొలిశెట్టి చెప్పగానే.. అమర్దీప్-శోభా శెట్టికి, టేస్టీ తేజ -షకీలాకి, పల్లవి ప్రశాంత్ -రతికాకి ఇలా అందరు తమ లేడీ లక్కీ చామ్ కి బ్రాస్ లైట్ ఇచ్చారు. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి హౌజ్ లో నుండి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. కంటెస్టెంట్ ఒకరికొకరు తెలుసుకొనే ప్రయత్నంలో కొందరు... ముందే పరిచయం ఉన్నవాళ్ళు వేరొక హోస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. జరిగింది. నాగార్జున గ్రాంఢ్ లాంచ్ రోజున స్టేజి మీద గౌతమ్ కృష్ణకి బేడీలు ఇచ్చి.. నీకు క్యూట్ గా అనిపించిన వాళ్ళకి బేడీలు వెయ్యమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ కృష్ణ కి క్యూట్ గా శుభశ్రీ అనిపించి తనకి బేడీలు వేసాడు. ఇదేదో టాస్క్ లాగా ఉందని బేడీలు చూసి శుభశ్రీ బయపడినా.. ఆ తర్వాత వాస్తవం తెలుసుకొని కుదుటపడుతుంది.
శోభా శెట్టి వచ్చి ఒక నెల రోజులు అయినట్లు ఫీల్ అయిపోయి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. మరొకవైపు బిగ్ బాస్ ఆదేశాల వరకు పడుకోకుడదేమోనని కన్ ఫ్యూషన్ లో శివాజీ ఉంటాడు. నాగార్జున ఆఫర్ చేసినప్పుడు సూట్ కేసు తీసుకున్న బాగుండేదని అనుకుంటాడు శివాజీ. చిలకకి చెప్పినట్టు చెప్పారు, డబ్బులు తీసుకొమని వింటేగా అని రతిక అంటుంది.