English | Telugu

నిఖిల్ నయ్యర్ ఎలిమినేటేడ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ!

బిగ్‌బాస్ సీజన్-9లో ఇప్పటికే పది వారాలు పూర్తయింది. ఇంకా అయిదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఫినాలే వీక్ తీసేస్తే ఉన్నది నాలుగు వారాలు మాత్రమే కానీ హౌస్‌లో ప్రస్తుతం పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే. అయితే అది ఈ వారమేనని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఈ వారం ఇమ్మాన్యుయల్ మినహా పది మంది నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కన్ఫమ్ చేశారు బిగ్ బాస్.

నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ నయ్యర్ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున. ‌ మిగిలిన వాళ్ళు ఇంకా నామినేషన్ లో ఉన్నారని సండే ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. కంటెంట్ ఇవ్వడంలో నిఖిల్ ఫెయిల్ కావడంతో పాటు ఓటింగ్ పరంగా కూడా నిఖిల్, గౌరవ్ ఇద్దరూ చాలా లీస్ట్ లో ఉన్నారు. టాస్కుల్లో ఇంపాక్ట్ చూపలేకపోవడం, తెలుగులో బాగా మాట్లాడలేకపోవడం, హౌజ్ లో సైలెంట్ గా ఉండటం, ఎంటర్ టైన్ చేయకపోవడం ఇవన్నీ నిఖిల్ ఎలిమినేషన్ కు దారి తీసాయి.‌ గత వారం నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికీ, నిఖిల్ ఎలాంటి మార్పు చూపించలేదు. ప్రస్తుతం హౌజ్ లో పదకొండు మంది ఉండగా శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు.. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ జరగాల్సి ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.