English | Telugu
Bigg Boss 9 Telugu: సంజనని కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిన రీతూ.. పొడిచేసిందిగా!
Updated : Nov 29, 2025
బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ మొత్తం ఎక్స్ కంటెస్టంట్స్ ని లోపలికి పంపించి టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్సే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అందులో భాగంగా కెప్టెన్సీ రేస్ లో లేని ముగ్గురు అయిన భరణి, తనూజ, సుమన్, ముగ్గురు బజర్ మోగినప్పుడు ముందు వెళ్లి డ్రాగన్ పట్టుకొని మీకు ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రాగన్ ఇవ్వాలి. వాళ్ళు కెప్టెన్ అవద్దనుకున్న వాళ్ళకి గుచ్చుతారని బిగ్ బాస్ చెప్పాడు.
మొదట బజర్ మోగినప్పడు సుమన్ వెళ్లి డ్రాగన్ పట్టుకొని రీతూ కి ఇస్తాడు. తను సంజనని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తుంది. మీరు కెప్టెన్ కాకపోతేనే ఇలా మాటలు వదిలేస్తున్నారు.. ఇప్పుడు కెప్టెన్ అయితే ఇంకెలా మాట్లాడతారో అని రీతూ రీజన్ చెప్తుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. మీరు రోజు చేసే పనే కదా చెప్పాను. ప్రొద్దున లేస్తావ్.. గొడవ పడుతావ్.. అలుగుతావు.. దూరం వెళ్తారు.. మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అవుతారు. ఇంతకు మించి నువ్వు ఏం చేస్తున్నావ్ చెప్పమని సంజన అడుగతుంది.
Also Read:బిగ్ బాస్-9 చివరి కెప్టెన్ ఎవరంటే..?
నీ కోసం సాక్రిఫైజ్ చేసాను.. మా నాన్న షర్ట్ వదిలేసి మరి అని రీతూ అంటుంది. నువ్వు షర్ట్ తీసుకోవడం వల్లే నా చీరలు అన్నిపోయాయని సంజన అంటుంది. అది కాదు నేను షర్ట్ ఇవ్వడం వల్లే నీకు చీరలు వచ్చాయి గుర్తు పెట్టుకోమని రీతూ అంటుంది. అసలు నా హెయిర్ కట్ చేసి సాక్రి ఫైజ్ చేసాను.. ఎందుకు చేసానా అని ఇప్పుడు అనిపిస్తుందని రీతూ అంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలో ఇమ్మాన్యుయల్ టాపిక్ వస్తుంది. దాంతో తను ఇన్వాల్వ్ అవుతాడు. కాసేపు రీతూ, ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ జరుగుతుంది.