English | Telugu

ఈ సీజన్ టాప్-7 ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్-7 మొదలు ఇప్పటి వరకు రోజుకో ట్విస్ట్ తో సక్సెస్ ఫుల్ గా ఈ షో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఫినాలే కోసం రెండు వారాలే మిగిలి ఉన్నాయి. దీంతో హౌస్ లో నువ్వా నేనా అంటూ టైటిల్ పోరులో కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్ లో ఉండగా.. ఇది ఈ సీజన్-7 కాబట్టి హౌస్ లో టాప్-5 ని కాకుండా టాప్-7 ని ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టాప్-5 ఎవరన్న క్లారిటీకి ప్రేక్షకులకు వచ్చారు. శివాజీ, ప్రశాంత్, యావర్ టాప్-3 కన్ఫమ్ కాగా.. అర్జున్, అమర్ టాప్ 5 గ్యారంటీ అని బయట టాక్ నడుస్తోంది. అయితే అమర్ మొదటి వారం నుండి వీకెండ్ లో నాగార్జున దగ్గర వరుసగా క్లాస్ లు తీసుకుంటునే ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు కూడా అమర్ అటతీరు మెరుగు పడలేదు. హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంలో శివాజీ తర్వాత అమర్ దీప్ అనే చెప్పవచ్చు. హౌస్ లో ఫిజికల్ టాస్క్ లలో కొందరు మైండ్ గేమ్ లో నిపుణులు అయితే మరికొందరు స్ట్రాటజీ, సపోర్ట్ గేమ్ ఆడుతున్నారు.

కానీ అమర్ విషయానికి వస్తే ఎలాంటి విభాగంలో కన్పించడం లేదు. ప్రతి టాస్క్ లో ఇండివిడ్యువల్ ఆడి గెలిచిన టాస్క్ ‌ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు శోభాశెట్టి, ప్రియాంకల హెల్ప్ తోసుకోవడమో లేక ఇతర హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. చివరి రెండు కెప్టెన్సీ టాస్క్ లలో అదే జరిగింది. నిన్న మొన్న జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో కూడా అమర్ ది అదే తంతు. పాయింట్ల కోసం మరీ దిగజారి ప్రియాంకని మాటలతో హింసించాడని చెప్పాలి.

ముందుగా అమర్ కీ శివాజీ శోభాశెట్టి పాయింట్లు ఇవ్వగా ఆ తర్వాత ప్రియాంకని కూడా తన పాయింట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసాడు కానీ గౌతమ్ కి ఇచ్చింది ప్రియాంక. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ లీస్ట్ లో ఉండి మళ్ళీ అమర్ కి తన పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత చివరగా అమర్ అర్జున్ లు ఉన్నప్పుడు.. నాకు సపోర్ట్ చెయ్ అంటూ ఫినాలే రేస్ లో ఉన్నా అర్జున్ వెళ్లి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ చివరికి ప్రతి టాస్క్ లలో కూడా సొంతంగా ఆడాలనే ఆలోచన మరచిపోతున్నాడు అమర్ దీప్. హౌస్ లో అందరి సపోర్ట్ తీసుకొని ఆడాలనే మైండ్ సెట్ లో అమర్ ఉన్నాడనేది అందరికి తెలిసిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.