English | Telugu
బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభాశెట్టి.. అందుకేనా హౌస్ లో ఉంచేది!
Updated : Dec 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో అమ్మాయిలు అంత గెట్ అవుట్ అనేట్టుగా మొదటి వారం నుండి వరుసగా ఏడు వారాల పాటు అమ్మాయిలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది ఉండగా.. అందులో మేల్ కంటెస్టెంట్స్ ఆరుగురు, ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఉన్నారు.
మొదటి నుండి సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడని ఇప్పటి వరకు న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎప్పుడు ఓటింగ్ లో లిస్ట్ లో ఉంటే శోభాశెట్టిని ఎలిమినేట్ చెయ్యకపోవడంతో ప్రేక్షకుల నుండి తీవ్రస్థాయిలో నిరసనలు వినిపించాయి. అయిన బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్ అంటు శోభాశెట్టిని సేవ్ చేస్తూనే వచ్చాడు. అందుకే ఈ న్యూస్ కూడా వాస్తవం అనుకున్నారు బిగ్ బాస్ అభిమానులు. కానీ దీనికి దీటుగా ప్రస్తుతం మరొక న్యూస్ వైరల్ అవుతుంది. శోభాశెట్టిని ఎలిమినేట్ చెయ్యకపోవడానికి కారణం అమర్ దీప్ ని విన్నర్ చెయ్యకుండా అపేందుకేనట. ఇప్పుడు శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తే తనకొచ్చే ఓటింగ్ మొత్తం అమర్ దీప్ కే పడతుందని అలా కాకుండా తను హౌస్ లో ఉండాలని శోభాశెట్టిని బిగ్ బాస్ ఎలిమినేట్ చెయ్యట్లేదని టాక్ వినిపిస్తుంది.
బిగ్ బాస్ ముద్దుబిడ్డగా ఇప్పటికే శోభాశెట్టిపై సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్స్ చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ ప్లాన్ తెలియకుండా జనాలు బిగ్ బాస్ ని అపార్థం చేసుకున్నారెమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది కంప్లీట్ సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ ఫేవర్ గా ఉంటున్నాడని అంటున్నారు. అయితే ఈ వారం కూడా శోభాశెట్టి ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. మరి బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్ లు ఏమీ చేయకుండా ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్న శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తాడో లేదో చూడాలి మరి.