English | Telugu

గ్రాంఢ్ లాంచ్ 2.0 లోని కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ ఎన్నడు లేనీ విధంగా ఉల్టా పుల్టాతో సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది. హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా, ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌజ్ లో ఇప్పుడు పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.‌ అయితే వీరితో షో పూర్తి స్థాయిలో నడవదని చెప్పాలి. దాంతో కిత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం 2.0 గా బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకురావడానికి బిబి యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే నాలుగ వారాలు ఫుల్ జోష్ తో రన్ అయిన మాట వాస్తవం. గత నాలుగు వారాల నుండి ఫిమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా బిగ్ బాస్ 2.0 మినీ లాంచ్ లో ఎక్కువ మంది ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గల నుండి సమాచారం. ఇప్పటికే దీనికోసం కొంతమందితో సంప్రదించి వాళ్ళతో అగ్రిమెంట్ లు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కూడా టీవీ రంగం నుండి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. సీరియల్ నటి అంజలి పవన్, పూజా మూర్తి, నయని పావని, అంబటి అర్జున్, బోలె షావలి ఇప్పటికే కన్ ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హౌజ్ లో సీరియల్ బ్యాచ్ , శివాజీ‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దాంతో కంటెస్టెంట్స్ నువ్వా - నేనా అంటూ గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పటికే శివాజీ టాప్-5 కంటెస్టెంట్ గా తనకి ప్రేక్షకులు వేసే ఓటింగ్‌ తో స్పష్టంగా తెలుస్తుంది.

బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే ఉల్టా పుల్డాతో రసవత్తరంగా కొనసాగుతుండగా, ఇక బయట నుండి వెళ్తున్న ఈ హౌస్ మేట్స్ ప్రేక్షకుల అంచనాలని తెలుసుకున్నారు. బిగ్ బాస్ రోజుకొక కొత్త ట్విస్ట్ తో కంటెస్టెంట్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. మొన్నటి వరకు పవరస్త్ర కోసం టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ టాస్క్ అంటు హౌజ్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. ఇది ఇలా కొనసాగుతుండగా, కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ షో ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది. మరి వీళ్ళు సీరియల్ బ్యాచ్ లో కలుస్తారా? ఎవరికి వారే ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతారా లేదా చూడాలి మరి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.