English | Telugu

ఈ వారం అమర్ దీప్ ఎలిమినేషన్ పక్కా.. రైతులని కించపరచడమే కారణమా?

బిగ్ బాస్ సీజన్-7 లో గతవారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఇప్పుడు అమర్ దీప్ ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సులు తొంభై శాతం ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‌కారణం లేకపోలేదు. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి దాదాపు పదకొండు రోజులు కావొస్తుంది.‌ కానీ హౌజ్ లో ఉన్నాడా లేడా అని నాగార్జున వచ్చినప్పుడు అన్నాడు. దాంతో మెల్లి మెల్లిగా ఇప్పుడే మేల్కొన్నాడు.‌ ఇక నామినేషన్లు అడ్డం పెట్టుకొని కామన్ మ్యాన్ ను నామినేట్ చేశాడు అమర్ దీప్.

బీటెక్ చదువుకున్న వాళ్ళని గ్రేట్ అని చెప్పే ప్రాసెస్ లో అమర్ దీప్.. రైతులని తగ్గించి మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలుసు. దాంతో ఎలాగైనా నామినేట్ చేసి అతడిని బయటకు పంపిస్తే మనకు కాంపిటీషన్ ఉండదంటు దాదాపు మిగిలిన పన్నెండు మంది పల్లవి ప్రశాంత్ గురించి అనుకుంటున్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్లో పదే పదే రైతు బిడ్డ అంటున్నావ్? ఏంటి గొప్పా? బిటెక్ చదివి, నా‌నా కష్టాలు పడి ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయి, అది సరిగ్గా సరిపోక, ట్రాఫిక్ లో లేట్ గా వెళ్తూ.. అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో మా కష్టాలు నీకు తెలుసా అంటూ సినినా డైలాగ్స్ ని కాపీ కొట్టాడు అమర్ దీప్‌.

అయితే ఇప్పటికే ఫేస్ బుక్ లో , ఇన్ స్టాగ్రామ్ లో అమర్ దీప్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు, వీడియోలు, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. రైతు కష్టాలు అతని చూసి వచ్చాడు కాబట్టి తనకి వచ్చిన డబ్బుని రైతుకి ఇద్దామనుకుంటున్నాడు. నీ మొఖానికి ఏనాడైనా రైతుల కష్టాలేంటో చూశావా అమర్ దీప్? అసలు రైతులు సూసైడ్ ఎందుకు చేసుకుంటారో తెలుసా అమర్ దీప్ ? అంటూ వీడియోల రూపంలో, పోస్ట్ ల రూపంలో అమర్ దీప్ ని విమర్శిస్తున్నారు. కాగా అమర్ దీప్ బయట కొన్ని ఫ్యాన్ పేజ్ లు క్రియేట్ చేసుకొని అందులో తనకు అనుకూలంగా కంటెంట్ రాసేలా చేసుకుంటున్నాడు. అయితే అమర్ దీప్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల దృష్ణిలో చాలా నెగెటివ్ అయ్యాడు.‌ ముఖ్యంగా అతను పల్లవి ప్రశాంత్ ని వాడిన పదాలన్నీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగుతుంది. భుజం దించరా, ఇక్కడ యాక్టింగ్ చేయకురా అంటూ అమర్ దీప్ చేసిన వాఖ్యలు పూర్తిగా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయంటున్నారు విశ్లేశకులు‌. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎంతో మందికి రిక్వెస్ట్ చేసుకొని బిగ్ బాస్ లోకి రావడానికి తను చాలా కష్టపడిన పల్లవి ప్రశాంత్ ని అందరు కలిసి టార్గెట్ చేశారని, దాంతోపాటు పూర్తిగా తనని ఫిజికల్ గా , మెంటల్ గా గేమ్స్ నుండి, హౌజ్ నుండి పంపించడానికే అమర్ దీప్ కావాలని చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. రైతులని మధ్యలోకి తీసుకురావడం మూర్ఖత్వమని, అది మొత్తం అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అమర్ దీప్ పై విరుచుకుపడుతున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.