English | Telugu

ఎందెందు వెతికినా అందందే శ్రీముఖి...అన్ని షోస్ లోనూ ఆమెదే హవా

ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద ఏ ఛానెల్లో చూసినా ఆ అల్లరి హోస్ట్ మాత్రమే కనిపిస్తోంది. ఆమె పేరే వినిపిస్తోంది. ఒకానొక సమయంలో సుమ, ఝాన్సీ, ఉదయభాను పోటాపోటీగా షోస్ ని హోస్ట్ చేసే వాళ్ళు. కానీ వాళ్ళల్లో అప్పటినుంచి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా సుమ మాత్రమే స్మాల్ స్క్రీన్ ని ఏలుతున్న క్వీన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను బీటౌట్ చేసేసి శ్రీముఖి టాప్ పొజిషన్ లోకి చేరిపోయింది. అంతేకాదు అనసూయని కూడా వెనక్కి నెట్టేసి ఆ షో కాదు, ఈ షో కాదు అన్ని షోస్ లో శ్రీముఖి మాత్రం తెగ హైలైట్ ఐపోతోంది. శ్రీముఖి ఒక పక్క సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హోస్ట్ గా, జాతిరత్నాలు, సరిగమప సింగింగ్ సూపర్ స్టార్, బంగారు బతుకమ్మ, దసరా వైభవం ఒకటేమిటి ఏ షో చూసినా అంతా శ్రీముఖిమయమే అన్నట్టుగా ఉంది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్..ఒకరికి ఒకరు షోకి హోస్ట్ గా చేస్తోంది. అలాగే ఫారెన్ లో జరిగే ఈవెంట్స్ కి కూడా శ్రీముఖి అటెండ్ అవుతూ అక్కడ కూడా ఎంటర్టైన్ చేసేస్తోంది. అలాగే మరో వైపు మంచి ఛాన్సులు వస్తుంటే మూవీస్ లో నటిస్తోంది. అలాగే యూట్యూబ్ ఒకటి రన్ చేస్తూ... సోషల్ మీడియాలో ఫాన్స్ ని కూడా పెంచుకుంటోంది. అందుకే శ్రీముఖికి టైం సరిపోక నిద్ర సరిపోవడం లేదు అంటూ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టేటుస్సుల్లో పోస్ట్ పెడుతూ ఉంటుంది. వెనకటికి మన పెద్దలు అన్నట్టు "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అనే సామెతను శ్రీముఖి చక్కగా ఫాలో అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.