English | Telugu
కంటతడిపెట్టిన కంటెస్టెంట్స్!
Updated : Oct 12, 2022
బిగ్ బాస్ రోజుకొక కొత్త టాస్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న మొన్నటిదాకా జోకర్, తగ్గాఫర్ లాంటి టాస్క్ లతో సరదగా ఆడుకున్న కంటెస్టెంట్స్, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కంటతడి పెట్టుకున్నారు. హౌస్ మేట్స్ అందరిని కనెక్ట్ చేస్తు, ఫ్యామిలీ సెంటిమెంట్ తో 'బ్యాటరీస్ ఛార్జ్' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
శ్రీహాన్, సుదీప, ఆదిరెడ్డి ఈ టాస్క్ లో పాల్లొన్నారు. మొదటగా టాస్క్ ఆడటానికి శ్రీహాన్ కన్ఫెషన్ రూం కి వెళ్ళాడు. "అక్కడ మూడింటిలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకోలేకపోతే దాని పర్యవసానం హౌస్ మేట్స్ మొత్తం ఎదుర్కోవాల్సి వస్తోంది" అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ ఆప్షన్స్ లో వాళ్ళ అమ్మ చేసిన ఫుడ్ తినే ఆప్షన్ ని ఎంచుకొనగా, హౌస్ లో ఉన్న బ్యాటరీ పదిహేను శాతం తగ్గిపోయింది. తర్వాత సుదీపను కన్ఫేషన్ రూంకి రమ్మన్నాడు బిగ్ బాస్. తనకి ఇచ్చిన ఆప్షన్ లో తన భర్త తో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొనగా, బ్యాటరీ ముప్పై శాతం తగ్గిపోయింది. "ఏంటి బిగ్ బాస్ ఇలా ఏడ్పించేస్తున్నావ్" అని సుదీప చెప్పేసి, కాసేపటి తర్వాత బయటకొచ్చేసింది.
ఈ టాస్క్ అయిపోయాక శ్రీహాన్ కి ఇంటి భోజనం రాగా, సుదీపకి తన భర్త రంగనాథ్ తో ఫోన్ మాట్లాడే అవకాశం లభించింది. ఈ టాస్క్ ముగిసాక సంతోషంతో సుదీప, శ్రీహాన్ బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పుకొన్నారు. అయితే సెంటిమెంట్ తో సాగిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కన్నీళ్ళతో ముగిసింది.
ఇలా ఒక్కోరోజు ఒక్కో ఎమోషనల్ సీన్స్ తో, సరదా సన్నివేశాలతో సాగుతోంది బిగ్ బాస్.