English | Telugu

గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ ప్లేస్ లో మరో సీరియల్ !

'గుప్పెడంత మనసు' సీరియల్ స్టార్ మాటీవీలో ప్రసారమవుతూ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతుంది. బుల్లితెర సీరియల్స్ లో ఈ సీరియల్ రేటింగ్ లో రెండవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ అనేకంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. స్క్రీన్ మీద రిషి, వసుధారల లవ్ స్టోరీకి మాములు క్రేజ్ లేదు. అయితే ఈ సీరియల్ యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం.. ఇప్పుడు ప్రేక్షకులకు అసంతృప్తిని కలుగజేస్తుంది.

స్టార్ మాటీవీలో కొత్తగా మొదలవుతున్న సీరియల్ 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. ఈ సీరియల్ ప్రోమోని రీసెంట్ గా విడుదల చేసిన యాజమాన్యం.. ఈ సీరియల్ ని 'గుప్పెడంత మనసు' సీరియల్ స్లాట్ టైమింగ్ లో వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 'గుప్పెడంత మనసు' సీరియల్ స్లాట్ టైమింగ్ ని మార్చుతున్నారా అనే కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు ఉన్నారు. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుధారలు ఒక్కటైన విషయం తెలిసిందే. కాగా ఆ సీరియల్ కొత్తగా మరొక ట్విస్ట్ తో మంచి ట్రెండింగ్ లో ఉండి విశేష ఆదరణ పొందుతుంది. దేవయాని కొడుకు శైలేంద్ర విలన్ గా ఎంట్రీ ఇచ్చి వారం రోజులే అవుతుంది.. ఇప్పుడే ఈ సీరియల్ కి శుభం కార్డు పడే అవకాశాలైతే లేవనే చెప్పాలి.. అయితే గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ ని చేంజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీరియల్ స్లాట్ చేంజ్ చెయ్యడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు తీవ్ర నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ మా యాజమాన్యంకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ స్లాట్ చేంజ్ చెయ్యవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి చాలా మంది అభిమానులు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. స్టార్ మా ఛానల్ అఫీషియల్ నెంబర్స్ కి కాల్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త సీరియల్ మొదలవడానికి ఇంకా వారం రోజులే టైం ఉండడంతో.. ఆ లోపు నిర్ణయం మార్చుకోండంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు రిషిధార ఫ్యాన్స్. అయితే గుప్పెడంత మనసు సీరియల్ ని అభిమానించే ఫ్యాన్స్ యొక్క రిక్వెస్ట్ ని వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.