English | Telugu
కృష్ణకి సపోర్ట్ చేసినందుకు రేవతిపై ఫైర్ అయిన భవాని!
Updated : Jul 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -206 లో.. శ్రీనివాస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటు భవాని బాధపడుతుంది. ఆ తర్వాత భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఇంట్లో లేకుంటే మీ లోటు బాగా తెలిసి వచ్చింది అత్తయ్య అని భవానితో ముకుంద అంటుంది. నేను లేనప్పుడు ఇంట్లో ఏమైందని భవాని అడుగుతుంది. కృష్ణ మురారి ఇద్దరు పెళ్లి చూడలేదని హోమం పేరిట వాళ్లకు పెళ్లి చేసిందని ముకుంద చెప్తుంది. తప్పేముంది వాళ్ళు భార్యభర్తలు కదా అని భవాని అంటుంది. కృష్ణ, మధుకర్ తో కలిసి ఇంట్లో డ్రింక్ చేసిందని ముకుంద చెప్పగానే.. భవాని షాక్ అవుతుంది. మీ తర్వాత ఇంట్లో తనే అన్నట్లుగా ప్రవర్తిస్తుందని ముకుంద అన్నీ కృష్ణపై కల్పించి చెప్తుంది. కృష్ణ కి సపోర్ట్ గా రేవతి అత్తయ్య వెనుకేసుకొస్తుందని ముకుంద చెప్తుంది. కృష్ణని ఇప్పుడే వెళ్లి అడుగుతానుంటూ భవాని వెళ్తుంది. మరొక వైపు కృష్ణకి ప్రపోజ్ చెయ్యాలని గోడపై ఐ లవ్ యు కృష్ణ అంటూ బెలున్స్ పెడతాడు మురారి. అటుగా వెళ్తున్న ముకుంద.. మురారి అలా డెకరేట్ చెయ్యడం చూసి షాక్ అవుతుంది. ఫామ్ హౌస్ లో ప్రపోజ్ చేస్తే అడ్డుపడ్డానని, ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావా? నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా అని ముకుంద అనుకుంటుంది.
మరొకవైపు భవాని హాల్లోకి వచ్చి కృష్ణ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని తొందరగా వచ్చిన కృష్ణ.. ఏం అయింది అత్తయ్య అని అడుగుతుంది. ఏం చెప్పమంటావ్? ఈ ఇంటి పరువు తీసే పని చేసావని చెప్పనా? ఏం అని చెప్పాలి అని భవాని అంటుంది. నీ కోడలు తాగి తందానాలు ఆడుతుంటే నాలుగు తిట్టి బయటకు పంపించాలని తెలియదా అని అక్కడే ఉన్న రేవతిపై భవాని కోప్పడుతుంది. ఇంట్లో కోడలు అన్న విషయం గుర్తుపెట్టుకొని ఉంటేనే ఈ ఇంట్లో స్థానం ఉంటుందని కృష్ణకి భవాని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి వెళ్లిన రేవతి.. కృష్ణ గురించి చెడుగా ఎందుకు చెప్పావని అడుగుతుంది. జరిగిందే కదా చెప్పానని ముకుంద అంటుంది. దాంతో ముకుంద ప్రవర్తన గురించి రేవతి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.