English | Telugu

ఈ భవనాలు, ఆస్తులు నాకొద్దు.. నా ఆత్మగౌరవం నాకివ్వండి చాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -63 లో.. రాజ్ కోపంతో కావ్యని లాక్కొచ్చి మీ కుటుంబం మొత్తం నటిస్తూనే ఉంటారా? మోసం చేస్తూనే ఉంటారా? అని రాజ్ అంటాడు. అసలేం జరిగింది? ఇప్పుడు నేనేం తప్పు చేశానని కావ్య అడుగుతుంది. మరి ఇంత అమాయకంగా ఎలా నటిస్తున్నావ్ అని రాజ్ అనగానే.. మాటలు అంటే సరిపోదు.. నేనేం తప్పు చేశానో సాక్ష్యం చూపించమని కావ్య అడుగుతుంది. నేనే సాక్షిని, నా కళ్ళే సాక్ష్యమని కావ్యతో అంటాడు రాజ్. వీళ్ళ అక్క ఎక్కడుందో నాకు తెలిసిపోయిందని, నేను హోటల్ కి వెళ్ళాను కదా.. నా కంటే ముందే హోటల్ కి వెళ్ళి వాళ్ళ అక్కని తప్పించిందని ఇంట్లో వాళ్ళతో చెప్తాడు రాజ్. మీ అక్కని తప్పించి ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నావ్.. మీ అక్క అంటే నీకు అసూయ అని కావ్యని ఇష్టమొచ్చిన మాటలు అంటాడు రాజ్. మా అక్క అంటే నాకు అసూయ ఎందుకు ఉంటుంది. మా అక్క అమాయకురాలు. దాన్ని ఇలా చేసినవాడు ఎవరో కనుక్కుందామని వచ్చానని కావ్య అంటుంది. ఏ చెల్లి అయినా అక్క పెళ్ళి చెడగొడుతుందా? అయినా ఇష్టం లేని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా.. దిక్కులేని పక్షిలా ఆ స్టోర్ రూమ్ లో ఉంటానా? అని కావ్య అంటుంది. మీదంతా నటన అని రాజ్ అంటాడు.

ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు రాజ్ చెప్పిన మాటలు విని కావ్యని తిడతారు. ఎందుకు అందరు ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ఎవరు వినట్లేదెందుకని కావ్య అంటుంది. నువ్వు హోటల్ కి వెళ్లడం నిజమేనా అని రాజ్ నానమ్మ అడగగా.. వెళ్ళానని కావ్య చెప్తుంది. వెళ్లడం నిజమైతే రాజ్ చేసే ఆరోపణలో నిజం ఉంది కదా.. వాడి ఆవేశంలో అర్థం ఉంది కదా అని రాజ్ నానమ్మ అంటుంది. నేను హోటల్ కి వెళ్తే.. తను ఉన్న కోపంలో అక్కడ ఎవరు ఉన్నది చూసుకోకుండా కోప్పడతాడు? అందరి ముందు ఈ ఇంటి పరువు పోతుంది కదా? మీరు అవునన్నా కాదన్నా నేను ఈ ఇంటి కోడలిని ఈ ఇంటి పరువుపోకుండా కాపాడుకునే బాధ్యత నాకు ఉందని కావ్య అంటుంది. ఈ భవనాలు అంతస్తులు, నగలు నాకేం వద్దు.. నా ఆత్మగౌరవం నాకు ఇవ్వండి చాలని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో రాజ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు నీ వల్లనే మనకీ కష్టాలు.. నీ వల్ల స్వప్న అలా తయారయింది. ఇప్పుడు కావ్య అత్తారింట్లో కష్టాలని భరిస్తుందని చెప్పుకుంటూ కనకంని కృష్ణమూర్తి తిడతాడు.

మరోవైపు స్వప్న గుడిదగ్గర కూర్చుని.. రాహుల్ కి ఫోన్ చేస్తుంది. మన విషయం ఇంట్లో చెప్పమని స్వప్న అనగానే.. మీ చెల్లెలి వల్ల ఇప్పుడు మన విషయం ఈ ఇంట్లో చెప్పే పరిస్థితి లేదని రాహుల్ అంటాడు. మరోవైపు బొమ్మలకు కలర్లు వేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.