English | Telugu

బ్లాక్ డ్రెస్ లో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న మల్లి!

భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

అయితే మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించని భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ అదరహో అనిపిస్తుంది భావన లాస్య. ట్రెండింగ్ లో ఉన్న 'సమ్మోహనుడ' పాటకి శ్రీసత్య, వాసంతి, ఇనయా చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. లాస్య ప్రియ ఈ పాటకు అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. మాములుగానే ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్, రీల్స్ తో బిజీగా ఉండే భావన లాస్య.‌. ఏం చేసిన ట్రెండ్ అవుతుంది. తాజాగా తను కేరళ టూర్ కి వెళ్ళింది. అక్కడ రకరకాల ఫోటోలని దిగి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.‌ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఈ ఫోటోలలో ఒక ఫోటో అయితే మరీ బోల్డ్ గా ఉంది. థైస్ చూపిస్తూ నిల్చొని దిగిన ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ గా మారాయి.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.