English | Telugu
బిగ్ బాస్ హౌజ్ లో మొదలైన హీటెడ్ నామినేషన్లు.. ప్రోమో అదిరిందిగా!
Updated : Sep 25, 2023
బిగ్ బాస్ సీజన్ -7 ఇప్పటికే మూడు వారాలు పూర్తిచేసుకుంది. ఇక నాల్గవ వారం నామినేషన్లతో మొదలైంది. ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఇలాంటి నామినేషన్ ప్రక్రియను చేయలేదు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్ యొక్క నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా తీసుకొచ్చాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ నామినేషన్ల ప్రోమో వచ్చేసింది. ఈ నామినేషన్లని ఒక కోర్ట్ రూమ్ తరహాలో ఉంచారు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్ తము నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ ని బోనులో ఉంచి సరైన కారణాలు చెప్పాలని, ఆ రీజన్స్ కి జ్యూరీ సభ్యులు అంగీకారం తెలపాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక జ్యూరీ సభ్యులుగా మూడు వారాల్లో హౌజ్ మేట్స్ గా అర్హత సాధించిన శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టి ఉన్నారు. ఇక ప్రిన్స్ యావర్ తన మొదటి నామినేషన్ ప్రియాంక జైన్ ని, రెండవ నామినేషన్ టేస్టీ తేజని చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆ రోజు హౌజ్ మేట్ కోసం జరిగే టాస్క్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి తనని సరైన రీజన్ లేకుండా పక్కకి తప్పించారనేది యావర్ వాదన.. అయితే జ్యూరీ సభ్యులలో ఒకరిగా ఉన్న శోభా శెట్టి దీనికి అంగీకరించలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇక యావర్ కి ప్రియాంకకి మధ్య మాటల యుద్ధం జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే టేస్టీ తేజకి యావర్ మధ్య టాస్క్ లో జరిగిన దాని గురించి హీటెడ్ ఆర్గుమెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది.
నామినేషన్ల ప్రక్రియకి ముందు శివాజీ, రతికరోజ్ ల మధ్య డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. నువ్వు హర్ట్ అయ్యావనే కదా సారీ చెప్పింది. ఎందుకు సాగదీస్తున్నావ్, కాళ్ళు పట్టుకోవాలా అంటు రతికతో శివాజీ చెప్పిన మాటలు.. చేయి చేయి కలిసి చప్పట్లు వచ్చాయని అన్నారని రతిక రోజ్ అనడంతో దానికి శివాజీ తనకోసమే అలా చేశానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ హీటెడ్ ఆర్గుమెంట్ దేని గురించి అసలు నామినేషన్లలో ఎవరెవరున్నారనేది తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే ఈసారి నామినేషన్ల ప్రక్రియ కొత్తగా ఉండటంతో పాటు ఉల్టా పల్టా థీమ్ ని బిగ్ బాస్ గట్టిగా ఫాలో చేస్తున్నట్టు తెలుస్తుంది.