English | Telugu

మగవాళ్ళకు జాగ్రత్తలు చెప్తున్న సుమ కనకాల!

మగవాళ్ళకి మాత్రమే ఇది.. అవును సుమ చెప్తుంది 'మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్త' అని కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అదేంటంటే మగవాళ్ళు బ్రాస్ లైట్స్ పెట్టుకోకూడదంట.. ఎందుకంటే చేతులని జేబులో పెట్టుకుంటే పొరపాటున ప్యాంట్ కి చిక్కుకుంటే ఎంత తీసిన రాకపోతే కష్ణమని, ఇబ్బంది అవుతుందని సుమ కనకాల అంది. అలా ఎందకు అందంటారా.. తన తోటి వ్యక్తి బ్రాస్ లైట్ తో ఉన్న చేతిని జేబులో పెట్టుకున్నాడు. అది ఎంత తీసినా రావట్లేదు. చాలా సేపటికి అది బయటకు వచ్చింది. అది చూసి సుమ స్పందించింది. త్రివిక్రమ్ గారు.. మీరు ఎందుకండి అలా అన్నారు.. అదే రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నా ఎక్కడికో తెలియట్లేదని ఎందుకన్నారండి ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇన్ స్పైరింగ్ గా తీసుకొని ఇతను ఎంత ఇబ్బంది పడ్డాడో అంటూ సరదాగా అనేసింది సుమ. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా విశేష స్పందన లభిస్తుంది.

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ 'స్ట్రెస్ బస్టర్స్' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే సుమ.. 'వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా అది వైరల్ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం 'ది‌ నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని ప్రారంభించి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మానవ సేవే మాధవ సేవ అంటూ పలువురు తన సేవని గుర్తించిన సంగతి తెలిసిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.