English | Telugu

ప్రేమ యాత్రలకు.. అంటూ డ్యూయెట్ పాడుకుంటున్న నవీన్ పోలిశెట్టి, సుమ కనకాల

సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించడానికి వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి మంచి ఎంటర్టైనర్, హీరో కం కమెడియన్ నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ తో పాటు మహేష్ ఆచంట కూడా వచ్చాడు. రావడంతోనే సుమ మీద పెద్ద జోక్ వేసేశాడు. షోకి వచ్చిన మహేష్ కి పూల బొకే ఇచ్చింది సుమ .."ఛ నీకెందుకు బొకే ఐనా మా ప్రోగ్రాంకి ఏవైనా దోషాలు ఉంటే నువ్వు అప్పుడప్పుడు వచ్చి పోతుంటావు కాబట్టి అవి పోతాయి" అని కౌంటర్ వేసింది. దానికి మహేష్ కి బాగా కోపం వచ్చి రివర్స్ కౌంటర్ వేసాడు "అంటే మీరు కూడా లైఫ్ లాంగ్ ఉంటున్నారు మీరు కూడా దోషమేనా" అనేసరికి నవీన్ పోలిశెట్టి బుర్ర గోక్కుంటూ నవ్వేసాడు.

సుమ ఆ కౌంటర్ కి షాకైపోయింది. తర్వాత "ప్రేమ యాత్రలకు" అంటూ నవీన్, సుమ ఇద్దరూ కలిసి బ్లాక్ అండ్ వైట్ డ్యూయెట్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఫైనల్ గా కృష్ణుడిలా ఫ్లూట్ వాయించాడు. "కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి...సెప్టెంబర్ 7 కి రిలీజ్ అవుతుంది మీ శెట్టి అండ్ మిష్టర్ పోలిశెట్టి " అని చెప్పి సెట్ లో కట్టిన ఉట్టిని పగలగొట్టాడు. ఇక పల్లెటూళ్లలో పొలాల్లోకి వెళ్ళడానికి వాడే నీళ్ల చెంబును గురించి ఎక్ష్ప్లైన్ చేస్తూ నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగ్స్ కి ఫిదా ఇపోయారు స్టూడెంట్స్, అరియనా, శివ జ్యోతి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఇందులో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. ఫస్ట్ ఈ మూవీని ఆగస్టు 4 న రిలీజ్ చేస్తామని చెప్పి తర్వాత ఆగస్టు 18 వస్తుందంటూ ఊహాగానాలు వచ్చాయి. వాటికి బ్రేక్ వేస్తూ కరెక్ట్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.