Read more!

English | Telugu

బిబి జోడి సెమీఫైనల్‌ ఎపిసోడ్‌లో జోడీల డ్యాన్స్ అదుర్స్!

ప్రతీ శని, ఆదివారాలలో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. ఈ షో తుదిదశకు చేరుకుంది. ఆదివారం రోజు సెమీఫైనల్‌ జరిగింది. సెమీ ఫైనల్ లో మొదటగా అర్జున్-వాసంతి పర్ఫామ్ చేసారు. వారి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు ఫిధా అయ్యారనే చెప్పాలి. పర్ఫామెన్స్ తర్వాత యాంకర్ శ్రీముఖి ఎలా ఉందని అడుగగా.. తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. మీ పర్ఫామెన్స్ కి నా గుండె నోట్లోకి వచ్చిందని చెప్పుకొచ్చింది సుధ. "నేను ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నాను. ఆ సాంగ్ లో‌ పెప్ ఉందా అని‌ డౌట్ వచ్చింది. ఇది పవర్ ప్యాక్ డ్ పర్ఫామెన్స్ కంటే కూడా డేంజర్ ప్యాక్ పర్ఫామెన్స్. సెమీ ఫైనల్ లోనే ఫైనల్ పర్ఫామెన్స్ లా చేసారు" అని రాధ చెప్పుకొచ్చింది.

అవినాష్- అరియానా జోడీ కలిసి డ్యాన్స్ చేసారు. మ్యాజిక్ ని మ్యూజిక్ ని కలిపి మ్యాజికల్ డ్యాన్స్ చేసిన వీరిద్దరి పర్ఫామెన్స్ వావ్ అనిపించింది. శ్రీముఖి వచ్చి మీరు మాయమయ్యారు కదా మళ్ళీ ఎందుకొచ్చారని అడుగగా.. బిబి జోడి ఫైనల్ కి వెళ్ళాలని మళ్ళీ తిరిగి వచ్చామని అవినాష్ చెప్పాడు. మెహబూబ్ - శ్రీసత్య జోడీ డ్యాన్స్ కి జడ్డెస్ ఫిధా అయ్యారు. సదా స్టేజ్ మీదకి వచ్చి ఇది ఫైనల్ లెవెల్ పర్ఫామెన్స్ అని చెప్పింది. నాకు ఇంతపెద్ద హార్ట్ ఉంటే అది మీకే ఇచ్చేదాన్ని అని మెహబూబ్ ని ఉద్దేశించి సదా  చెప్పింది. "మీరు చేసిన ప్రతీ చిన్న చిన్న మూమెంట్స్ కూడా వావ్ అనిపించాయి. ఐ లవ్ యువర్ పర్ఫామెన్స్" అని రాధ చెప్పింది. ఐ థింక్ దిజ్ ఈజ్ ట్రైలర్ ఫర్ ఫినాలే అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. 

బిబి జోడి ఫినాలే రేస్ లీడర్ బోర్డ్ లో మొదటి ప్లేస్ లో మెహబూబ్-శ్రీసత్య జోడి ఉండగా.. ఆర్జే చైతు-కాజల్, అఖిల్-తేజస్విని జోడీలు‌ లీస్ట్ లో ఉన్నారు. అఖిల్ కి ఆరోగ్య సమస్య ఉండటం వల్ల అతను డ్యాన్స్ చేయడానికి రాలేకపోయాడు దీంతో అఖిల్-తేజస్విని జోడీ ఎలిమినేట్ అయ్యారు. ఆర్జే చైతు- కాజల్, అర్జున్-వాసంతి,  మెహబూబ్-శ్రీసత్య, అవినాష్-అరియానా, సూర్య-ఫైమా జోడీలు బిబి జోడి ఫినాలాకే చేరాయి.