English | Telugu
గీతూతో అంత బాండింగ్ ఎలా కుదిరింది?
Updated : Dec 21, 2022
బిగ్ బాస్ ముగియగానే టాప్-5 లో ఉన్నవాళ్ళకి 'బిబి కేఫ్' ఎగ్జిట్ ఇంటర్వ్యూ అనేది కామన్ గా జరుగుతుంది. అయితే ఇందులో టాప్-4 గా నిలిచిన కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఇంటర్వ్యూ తీసుకున్నాడు యాంకర్ శివ.
శివ ఇంటర్వ్యూ అంటేనే కాంట్రవర్సీ ఆర్గుమెంట్ తో మొదలుపెడతాడు. "ఒక రివ్యూయర్ గా లోపలికి వెళ్లి, హౌస్ లో గీతూతో కలిసి రివ్యూ చేసారు. అసలు బయట ఎలా ఉంటుందో తెలుసా మీకు? హౌస్ మేట్స్ ని ఎలా జడ్జ్ చేయగలరు?" అని శివ అడిగాడు. "హౌస్ లో జరిగిన ప్రతి విషయం టీవీలో చూపించకపోవచ్చు. కానీ నేను దగ్గర నుండి చూసా కాబట్టి కొన్ని అంచనా వేయగలను. నేను రివ్యూయర్ గా బిగ్ బాస్ కి రివ్యూ ఇస్తున్నాను. చాలా మంది గురించి పాజిటివ్స్ ఇంకా నెగెటివ్స్ చెప్పాను. కానీ హౌస్ లోకి వెళ్ళాక నా గురించి ఒక్క పాజిటివ్సే మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే.. 'తన వరకు వచ్చేసరికి ఇలానే ఉంటాడా ఆదిరెడ్డి' అని ప్రేక్షకులు అనుకుంటారు. ఆ ప్రెజర్.. నాకు అందరితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంది" అని ఆదిరెడ్డి చెప్పాడు.
"మీరు ఇంట్రావర్ట్ కదా? మరి గీతూతో అంత బాండింగ్ ఎలా కుదిరింది? ఇద్దరు రివ్యూయర్స్ అనా?" అని అడిగాడు శివ. "అలా ఏం లేదు.. బిగ్ బాస్ ఇద్దరు రివ్యూయర్స్ ని తీసుకున్నాడు. నేను ఫస్డ్ లోపలికి వెళ్ళాక, మా ఇద్దరికీ కాంట్రవర్సీ ఉంటుందేమోనని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. గీతు మంచి గేమర్" అని చెప్పాడు ఆదిరెడ్డి. "నువ్వు ఉండగా సూట్ కేస్ తీసుకొస్తే తీసుకునేవాడివా?" అని శివ అడిగాడు. "అసలు తీసుకునేవాడినే కాదు. అది విన్నర్ ప్రైజ్ మనీ. ఇంకా హౌస్ లోకి వెళ్ళేముందు ఎవరితో అయినా మాట్లాడాలంటే సిగ్గుపడేవాడిని. ఇప్పటికీ నేను ఇంట్రావర్టే. కానీ హౌస్ లోకి వెళ్ళాక తగ్గింది. అందరితో కలిసి ఉండేసరికి ఆ ఫీలింగ్ తగ్గింది" అని తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.