English | Telugu
సుమకి అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం అన్న బాలయ్య
Updated : Jun 30, 2023
బాలయ్య బాబు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఆయన ఆల్ రౌండర్..సరదాగా మాట్లాడతారు...ఫన్నీగా కౌంటర్ లు వేస్తారు. బాలయ్య అంటే వాట్ నాట్ అనిపించుకునేలా ఉంటుంది ఆయన ఆటిట్యూడ్. అలాంటి బాలయ్య యాంకర్ సుమ మీద సెటైర్లు పేల్చారు. ఆయన మాటలకు ఆమె అవాక్కయ్యింది. ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మైక్ తీసుకుని వేరే లెవెల్ లో మాట్లాడారు. ఆయన మైక్ తీసుకునేసరికి ఫ్యాన్స్ అంతా ‘కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. ఆ మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.. తనను సెక్సీ అంటే సుమ, విమలా రామన్, మమతా మోహన్ దాస్ అందరూ జెలస్ ఫీలవుతారు అన్నారు నవ్వుతూ.
"నేను రాగానే ఈవిడ అంది నేను చెప్పకుండా చప్పట్లు కొడతారా అని.. ఈవిడకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం..కానీ ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి.. చెప్పు దెబ్బలు కొడుతుంది.. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో’ అని సుమని అనేసరికి ఆమె షాకైపోయి అలానే నవ్వుతూ బాలయ్యని చూస్తుండి పోయింది. ఇంతలో జగపతి బాబు మైక్ తీసుకుని "సుమ బిజీగా ఉండడం వల్ల బాలయ్య బాబు డేట్ కూడా మార్చుకున్నారని" చెప్పడంతో "వద్దు సర్ ఇక చాలు" అంది సుమ ..దాంతో ‘సీమసింహం’ లోని ‘పోరీ హుషారుగుందిరోయ్’ అనే లైన్ పాడి అలరించారు బాలయ్య. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ యాంకరింగ్ పెట్టింది పేరు. ఆమెకు డేట్స్ ఖాళీగా లేకపోతే గనక ఆ ఈవెంట్ ని పోస్ట్ పోన్ కూడా చేసేస్తారు. ఇక సుమ హోస్టింగ్ అంటే చాలు అందరూ అలా చూస్తుండిపోతారు..ఒక్కోసారి ఆమె వేసే కామెంట్స్, సెటైర్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సుమకే చెంపదెబ్బలు అవసరం అన్న బాలయ్య కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.