English | Telugu

'అన్‏స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య!

'అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో ఓటీటీ వేదిక ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. బాలయ్య ఎనర్జీకి, టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి లతో కలిసి అన్‏స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బాలయ్య.. త్వరలో అఖండ మూవీ టీమ్ తో కలిసి అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

'అన్‏స్టాపబుల్' షో 4 వ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది. ఈ బాలయ్య హీరోగా నటించిన అఖండ మూవీ టీమ్ పాల్గొనడం విశేషం. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నలుగురితో కలిసి బాలయ్య ఫుల్ అల్లరి చేసారని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. 'నేను విలన్ గా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను.. కానీ హీరో కూడా నేనే' అంటూ తనదైన టైమింగ్ తో నవ్వించారు బాలయ్య. 'మాలిని స్టూడియో అని' అంటూ బోయపాటి ఏదో చెప్పబోతుండగా 'మాలిని ఎవరు?.. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ?..' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. జై బాలయ్య సాంగ్ కి ప్రగ్యాతో కలిసి చిందేసిన బాలయ్య.. 'పాట నీదైనా పాప నాది' అంటూ ప్రగ్యాని ఉద్దేశించి తమన్ తో అన్నాడు.

Also Read: 'అఖండ' మూవీ రివ్యూ

ఇక ఈ ఎపిసోడ్ లో రాజకీయ పరమైన విమర్శలపై కూడా బాలయ్య స్పందించాడని ప్రోమో చూస్తే తెలుస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి లాక్కున్నారని ప్రత్యర్థులు ప్రస్తుత టీడీపీ నాయకత్వంపై విమర్శలు చేస్తుంటారు. దీనిపై స్పందించిన బాలయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "వెన్నుపోటు పొడిచారు అనేది తప్పుడు ప్రచారం. చెప్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని. ఫ్యాన్స్ లో ఒకడిని" అని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఫుల్ ఎపిసోడ్ వస్తే ఈ అంశంపై బాలయ్య ఇంకా ఏం మాట్లాడారో తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.