English | Telugu
'అన్ స్టాపబుల్' షూట్ లో పవర్ స్టార్.. త్రివిక్రమ్ కి బదులుగా ఆయన!
Updated : Dec 27, 2022
నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓటీటీ షో 'అన్ స్టాపబుల్' సీజన్-2 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' మూవీ సెట్స్ లో పవన్ సందడి చేసిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వీరిద్దరూ కలిసి అన్ స్టాపబుల్ షోలో చేసే అల్లరిని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి ఆశ నెరవేరనుంది. నేడు పవన్ ఎపిసోడ్ షూట్ జరుగుతోంది.
పవన్ తో పాటు ఈ షోలో ఆయన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పాల్గొంటారని భావించారంతా. కానీ ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ జాగర్లమూడి సందడి చేయనున్నారట. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడనున్నాడని సమాచారం. పవన్, సాయి తేజ్ కలిసి 'వినోదయ సిత్తం' రీమేక్ లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. దాని గురించి ఈ షోలో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.
'అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన పవన్ కి బాలకృష్ణ, అల్లు అరవింద్ ఘన స్వాగతం పలికారు. ఈ ఎపిసోడ్ ని రెండో సీజన్ ముగింపు ఎపిసోడ్ గా ప్రసారం చేయనున్నారని సమాచారం.