English | Telugu
నీకు, మీ ఫ్యామిలీకి యాటిట్యూడ్ అంటూ ఒకరినొకరు స్టేజి మీదే తిట్టుకున్న అవినాష్, ప్రభాకర్
Updated : Dec 27, 2022
బుల్లితెర యాక్టర్స్ కి ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అలాంటి బుల్లితెర ద్వారా పరిచయమైన వ్యక్తి నటుడు ప్రభాకర్. ఐతే రీసెంట్ గా ప్రభాకర్ ని ఆయన ఫామిలీని స్టేజి మీద అవమానించాడు అవినాష్. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇందులో "కృష్ణ ముకుంద మురారి" సీరియల్ తరపున ప్రభాకర్ వచ్చాడు. అలాగే "అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" అనే సీరియల్ టీమ్ కూడా వచ్చింది. వీళ్ళతో గేమ్స్ ఆడించింది హోస్ట్ శ్రీముఖి. ఈ గేమ్స్ లో భాగంగా కమెడియన్ అవినాష్ ముగ్గురమ్మాయిలను ఎత్తుకున్నాడు. అది చూసిన వెంటనే శ్రీముఖి అవినాష్ భార్య అనూజకు ఫోన్ చేసి ఇంట్లో నిన్ను ఎన్ని సార్లు ఎత్తుకున్నాడు అని అడిగేసరికి ఆమె 3 - 4 సార్లు అని చెప్పింది. కానీ ప్రోగ్రాంలో మాత్రం ముగ్గురమ్మాయిలను ఎత్తుకున్నాడు అని శ్రీముఖి చెప్పింది. అది ప్రొఫెషన్ లో భాగం కదా అని అంది అనూజ..ఇంతలో "వాడి ప్రొఫెషనే అది అని చెప్పండి" అంటూ నటుడు ప్రభాకర్ కౌంటర్ వేసాడు.
తర్వాత కాసేపు డాన్స్, గేమ్స్ తో ఎంటర్టైన్ చేసింది శ్రీముఖి. అదే టైంలో మళ్ళీ "ఎందుకురా నీకు అంత ఆటిట్యూడ్ " అని ప్రభాకర్ మళ్ళీ అవినాష్ ని టార్గెట్ చేసేసరికి "మీ అబ్బాయికి ఎందుకంత యాటిట్యూడ్" అని రివర్స్ లో అవినాష్ అనేసరికి అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. "నువ్వు యాటిట్యూడ్ తగ్గించుకో" అని ప్రభాకర్ చాలా గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న అవినాష్ "నాకు యాటిట్యూడ్ లేదు అర్దమయ్యిందా..మీకు మీ ఫామిలీకి ఉంది అర్దమయ్యిందా" అని షాకింగ్ కామెంట్స్ చేసాడు అవినాష్.