English | Telugu

రాజు గారి గది 4 లో చిన్న దెయ్యంగా నటించే ఛాన్స్ కొట్టేసిన బినిత


డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో ఫుల్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. మంచి డాన్స్ లతో అలరించింది. ఫైనల్ గా ప్రాకృతి - మానస్ కి మధ్య ఎప్పటిలాగే గొడవ జరిగిపోయింది. ఐతే ప్రాకృతి తన మాటలకు సారీ చెప్పింది. ఐతే ఇంత షోలో యష్ మాష్టర్ కంటెస్టెంట్ కి ఓంకార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె ఎవరో బినిత ఛెత్రి. అసలు బినీత డాన్స్ మాములుగా ఉండదు. ఈమె ఇండియాస్ గాట్ టాలెంట్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అంతా షాకయ్యారు.... ఆమె డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇప్పుడు ఆమె తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో యష్ మాష్టర్ కంటెస్టెంట్ గా ఉంది. ఈ వారం బినిత డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాక యాంకర్ ఓంకార్ ఒక మాట అన్నాడు. నెక్స్ట్ "రాజు గారి గది 4 " చేస్తే గనక బినితని డెఫినిట్ గా తీసుకుంటాను అని చెప్పాడు.

"మరి ఏంటి బినిత యాక్ట్ చేస్తావా" అని అడిగేసరికి చేస్తాను అని చెప్పింది. "చిన్న దెయ్యంగా నటిస్తుంది" అన్నాడు యష్. దానికి ఓంకార్ కూడా చిన్న దెయ్యంగా నటించాలి అన్నాడు. ఇక ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శేఖర్ మాష్టర్ ఐతే ఫిదా ఐపోయాడు. "ఎం డాన్స్ అమ్మా నీది..నువ్వు ఇండియానే కదా నీ డాన్స్ తో వరల్డ్ ని కూడా షేక్ చేసే రోజు కూడా రావొచ్చు. బినిత చాలా రేర్ పీస్. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బెస్ట్ పెర్ఫామర్...బెస్ట్ డాన్సర్ వి " అని చెప్పాడు. ఫైనల్ లో ఎలిమినేషన్స్ రౌండ్ లో యష్ మాష్టర్ తన కంటెస్టెంట్ బినితకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న ప్రకృతిని - బర్కత్ జోడిని ఎలిమినేట్ చేసాడు. యష్ ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా తన చోటా కంటెస్టెంట్ ని కాపాడుకుంటూ ఆమెకు ఎవరూ కాంపిటీషన్ లేకుండా స్ట్రాటజీగా గేమ్ ప్లే చేస్తూ వస్తున్నాడు. ఈ వారం కూడా యష్ - బినిత సేఫ్ జోన్ లో ఉన్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.