English | Telugu
Ashwini sree : అరేబియన్ గుర్రమని అశ్వినిని ఎందుకంటారో చెప్పిన నెటిజన్!
Updated : Feb 1, 2024
అరేబియన్ గుర్రానికి ఓ కథ ఉంటే.. అది ఇప్పుడు తెలుసుకుందాం. కుర్రాళ్ళ మనసుల్లో అరేబియన్ గుర్రానికి ఓ మీనింగ్ ఉంది. అది అర్థమైనోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ మీనింగ్ అర్థం చేసుకోవాలంటే కాస్తంత డర్టీ మైండ్ కూడా ఉండాలని ఓ నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో అన్నాడు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. అందులో అరేబియన్ గుర్రమని మిమ్మల్ని ఎందుకంటారో తెలుసా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి అశ్వినిశ్రీ తన వర్షన్ లో సమాధానమిచ్చింది.
అశ్వినిశ్రీ తెలుగమ్మాయి. 1989 జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని. అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 497K ఫాలోవర్స్ ని కలిగి ఉంది.
అశ్వినిశ్రీ తాజాగా ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో ఒక నెటిజన్.. మిమ్మల్ని అరేబియన్ హార్స్ అని ఎందుకంటారో తెలుసా అని అడిగాడు. దానికి అశ్వినిశ్రీ ఇలా సమాధానమిచ్చింది. ఎందుకంటే నా పేరు అశ్విని కాబట్టి అశ్విని అంటే గుర్రం కాబట్టి నన్ను అలా అంటారు. ఐ ఆక్సెప్టెడ్. నా హైట్ అండ్ నా పర్సనాలిటీకి అలా అంటారు. బికాజ్ ఈజ్ మై సిల్కీ హేయిర్ చూసి అలా అనుకుని ఉంటారని అశ్విని అంది. ఇక మరో నెటిజన్ అరేబియన్ హార్స్ అంటే మీనింగ్ అది కాదండి బాబు..హైట్ పర్సనాలిటీ అంత హాట్ అని చెప్పగా.. థాంక్స్ సోమచ్ అని అశ్విని అంది. నన్ను పెళ్ళి చేసుకుంటారా అని ఒకరు అడుగగా.. డెఫినెట్లీ నువ్వు నాకు నచ్చితే కచ్చితంగా పెళ్ళి చేసుకుంటా. తాళి పట్టుకొని రెడీగా ఉండు. నాకు నిజంగా నచ్చితే ఎంత ఎక్స్ ట్రీమ్ కైనా వెళ్తా అని అశ్విని అంది. డిసి మోటర్ ఎలా స్టార్ట్ అవుతుందని ఒకరు అడుగగా. గుడ్ క్వశ్చన్ అండి అని చెప్పి మోటర్ సౌండ్ చేస్తూ చెప్పింది అశ్విని. ఈసారి రాజమండ్రికి వస్తే చెప్పి రండి అని ఒకరు అడుగగా.. సరేనని అశ్వినిశ్రీ అంది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలకి సమాధానమిచ్చింది అశ్విని.