English | Telugu
నేను బాగానే ఉన్నాను...ఆ పుకార్లను నమ్మొద్దు
Updated : Jun 27, 2023
షూటింగ్ టైములో తన కాలికి గాయం అయ్యిందని దాంతో హాస్పిటల్ లో చేరినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఒక మెసేజ్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "ప్రియమైన అందరికీ , నేను ఆరోగ్యంగానే ఉన్నాను, షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను మీరంతా దయచేసి నమ్మొద్దు. నేను బాగున్నానన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఇది రాస్తున్నాను. బోనాలు పండుగ నేపథ్యంలో ఒక సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళాను..షూటింగ్ లో నాకు ఎలాంటి గాయాలు కాలేదు...ఇక నేను చేసిన డాన్స్ సూపర్ డూపర్ గా ఉండబోతోంది. దాన్ని మీరంతా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు." అని ఆ మెసేజ్ లో చెప్పారు.
జానపద గేయాలకు పెట్టింది పేరు మంగ్లీ..ప్రైవేట్ సాంగ్స్ తో ఆమె ఎంతో పేరు సంపాదించుకున్నారు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి నెమ్మదిగా అంచలంచెలుగా స్టార్ సింగర్ గా ఎదిగారు. మూవీస్ లో ఆమె తన సాంగ్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా వచ్చిన "బలగం" మూవీ "ఊరు పల్లెటూరు" అనే పాట ఆమెకు మరింత క్రేజ్ ని సంపాదించిపెట్టింది. చాలా తక్కువ టైములో ఎక్కువ సాంగ్స్ పాడిన సింగర్ గా మంగ్లీకి మంచి గుర్తింపే ఉంది. ప్రతీ పండగకు ఆమె ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఆమె చేసిన ఒక సాంగ్ షూటింగ్ లో ఆమె కాలికి గాయమైందంటూ పుకార్లు వచ్చాయి. దానికి ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇక మంగ్లీ పాడే పాటలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. ఇలా ఒక సాంగ్ ఆమె పోస్ట్ చేస్తారో లేదో అలా మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి.