English | Telugu

అష్షు మనసు ఎంత విశాలమో!

సోషల్ మీడియాలో అష్షురెడ్డి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. రీసెంట్ గా ఆర్జీవీతో కలిసి చేసిన మూవీ ప్రమోషన్ తో ఆమె వార్తల్లో నిలిచింది. అప్పుడు ఆమెను తిట్టని వాళ్ళు లేరు. ఐతే ఇప్పుడు అష్షురెడ్డి అద్భుతమైన పని చేసి మళ్ళీ వార్తలకెక్కింది. అష్షు తనకు తోచినంతలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అలా చేస్తున్న వారిలో ఇద్దరమ్మాయిలు బీటెక్‌ డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అషురెడ్డి చెప్పుకొచ్చారు.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో.. ‘‘ నన్ను శాంటాలాగా ఉండమని వాళ్లు అంటున్నారు. నాకు దేవుడిచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చదువుకు ఆయే ఖర్చును నేను స్పాన్సర్ చేయడం నిజంగా అదృష్టం. ముఖ్యంగా కళ్యాణి, శ్రేయలకు నేను కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్లు ఇప్పుడు బీటెక్‌ డిగ్రీని పూర్తి చేశారు. మీరంతా నా జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ఎం చేసానో తెలీదు కానీ మీ అందరి ప్రేమా నాకు అందింది.

ఐతే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు వేరేవారితో దయగా ఉన్నప్పుడు వాళ్లకు సాయం చేయడానికి దేవుడు మీకో దారిని చూపిస్తాడు. మీరు తప్పకుండా సాయం చేయండి’’ అని చెప్పింది అష్షు. ఇక అష్షు చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ తెగ పొగిడేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.