English | Telugu

వైరల్ గా మారిన అషురెడ్డి గ్లామర్ ట్రీట్!

ఇన్ స్టాగ్రామ్ లో కొందరి ఫోటోషూట్ లకి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది‌. అందులోను అరియానా, ఇనయా, అషురెడ్డి, అనసూయ లాంటి వారు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోషూట్ లకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

అయితే తాజాగా అషురెడ్డి బ్లాక్ డ్రెస్ లో ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో అషుని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు‌. అటు ఎండలు.. ఇటు అషు అందాలు అంటు ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కొంచెం గ్యాప్ ఇవ్వండి రా.. జనాల్ని ఊపిరి తీసుకోనివ్వాలిగా అని యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా కామెంట్ చేయగా.. దానికి అషురెడ్డి లాఫింగ్ రియాక్షన్ ఇచ్చింది. ప్రపంచం తలకిందులైనా ఎలాగైనా ఈ రోజు అని మరొకరు కామెంట్ చేసారు. అషు నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఉందని మరొకరు కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో అప్లోడ్ చేసి ఒకరోజే అవుతుంది కానీ వన్ మిలియన్ వ్యూస్ ని దాటేసింది. అంతలా ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది అషురెడ్డి.

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది. మరి తాజాగా అషురెడ్డి షేర్ చేసిన ఈ హాట్ రీల్ ని మీరు చూశారా కామెంట్ చేయండి.


ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.